యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో మూవీ పై దేశవాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికె ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్, సినిమాపై ఆడియన్స్ లో తారా స్థాయిలో అంచనాలు పెంచడంతో, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని అందరూ ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ను కూడా భారీ స్థాయిలో, అలానే అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా టిక్కెట్ల ధరలు కూడా మొదటి వారం భారీ స్థాయిలోనే పెంచనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ రేంజ్ సూపర్ స్టార్ కావడంతో, అటు హిందీలో కూడా సినిమా టికెట్స్ కోసం విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా, 

ఎట్టకేలకు ఈ సినిమా సెన్సార్ నిన్న జరిగినట్లు, అలానే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఆ విషయం అటుంచితే మొత్తంగా 2 గంటల 54 నిమిషాల నిడివిగల సాహో సినిమాను వీక్షించిన సెన్సార్ మెంబెర్స్, సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ అలానే యాక్షన్ మరియు ఛేజింగ్ సన్నివేశాలు, సాంగ్స్ లోని లొకేషన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారట. కానీ, పూర్తిగా సినిమా చూసిన తరువాత టోటల్ గా సినిమా ఎలా ఉంది అనేది మాత్రం చెప్పలేకపోయారట. నిజానికి ఏదైనా సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో, ఆ సినిమాను వీక్షించే సెన్సార్ మెంబెర్స్, దాని ఫలితాన్ని వారికి నచ్చిన మాటల్లో తెలియపర్చడం, ఆ న్యూస్ బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి నిన్న సెన్సార్ జరిగిన సాహో కు సంబంధించి, వారు ఫలితం పై ఎటువంటి విషయాన్నీ పూర్తిగా వెల్లడించలేదని అంటున్నారు. 

అయితే దానిపై భిన్నవాదనలు వినపడుతున్నాయి, కొందరేమో సెన్సార్ వారికి సాహో నచ్చక పోవడం వల్లనే వారు సినిమా ఫలితాన్ని తెలుపలేదు అంటుంటే, మరికొందరేమో అది నిజం కాదు, ఒకవేళ సినిమా ఫలితాన్ని ముందే మీడియా ద్వారా లీక్ చేస్తే, సినిమా మీద ఉన్న అంచనాల పై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుందని భావించే, సాహో యూనిట్ సభ్యులే, సెన్సార్ వారికి తమ సినిమా ఫలితంపై ఎటువంటి స్పందనను బయటపెట్టవద్దని కోరినట్లు చెప్తున్నారు. ఈ రెండిటిలో ఏది నిజమో ఏది అబద్దమో ప్రక్కన పెడితే, ఈ సినిమా ప్రీమియర్ షో తరువాత వచ్చే టాక్ ని మాత్రమే నమ్మగలం అని, ఎందుకంటే అసలే ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో, మధ్యలో వచ్చే ఎటువంటి టాక్ కూడా నమ్మలేమని అంటున్నారు సినిమా విశ్లేషకులు...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: