‘సాహో’ హడావిడి ముగిసిపోయిన తరువాత సెప్టెంబర్ 13న నాని వరుణ్ తేజ్ ల మూవీలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కాబోతున్నాయి అన్నసంకేతాలు నిన్నటి వరకు వచ్చాయి. దీనితో నాని వరుణ్ తేజ్ ల వార్ లో ఎవరు విజేత కాబోతారు అన్న అంచనాలు కూడ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు నాని ‘గ్యాంగ్ లీడర్’ ఈరేస్ నుండి తప్పుకుని సెప్టెంబర్ 19న విడుదల అయ్యేలా వ్యూహాలు మార్చుకున్నట్లు లేటెస్ట్ సమాచారం.  

తెలుస్తున్న సమాచారం మేరకు నాని ఈనిర్ణయం తీసుకోవడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అనిఅంటున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్ టైటిల్ ను తాను వాడుకున్నందుకు మెగా అభిమానుల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తున్న నేపధ్యంలో అదే కుటుంబానికి చెందినా యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ తో తాను పోటీగా నిలిస్తే తన పై మరింత ద్వేషం మెగా అభిమానులకు కలుగుతుంది అన్న ఉద్దేశ్యంతో బాగాఆలోచించి నాని ఒక వెనకడుగు వేసినట్లు టాక్. 

ముఖ్యంగా ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం మొదలైతే అసలుకుమోసం వస్తుంది అన్నఆలోచనలతో నాని ఈనిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈమూవీ మేకర్స్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఒకపోస్టర్ పై కూడ మెగా అభిమానులలో అసహనం మొదలైంది. నిన్న విడుదల చేసిన నాని ‘గ్యాంగ్ లీడర్’ పోష్టర్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని సీన్ ను పూర్తిగా కాపీ చేసినట్లు ఉందని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

గ్యాస్ కట్టర్ ని చేతిలో పట్టుకుని బ్లాక్ గాగుల్స్ తో అచ్చం 1991లో వచ్చిన చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ లోని లుక్ ని రీ క్రియేట్  చేసేప్రయత్నం నిన్న విడుదల చేసిన నాని ‘గ్యాంగ్ లీడర్’ పోస్టర్ లో కనిపించింది. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో చిరంజీవి తన అన్నయ్యను హత్య చేసిన సంఘటన తాలూకు ఫోటోలు ఒక లాకర్ లో ఉన్నాయని తెలుసుకుని చిరంజీవి ఆ ఐరన్ డోర్ ని బ్రేక్ చేయడంకోసం ఇలాంటి లుక్ ను ఇచ్చాడు. ఇప్పుడు అదే లుక్ ను పూర్తిగా నాని కాపీ కొట్టడం ఏమిటి అంటూ టైటిల్ మాత్రమే కాకుండా ఇలా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ని కూడ నాని కాపీ కొట్టేస్తాడా అంటూ మెగా అభిమానులు విరుచుకు పడుతున్నారు..     


మరింత సమాచారం తెలుసుకోండి: