శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు సినిమా ప్రేమికుల‌కు పండ‌గ‌నే చెప్పాలి.  వారం వారం కొత్త సినిమాలు కొత్త కొత్త క‌థ‌లు మ‌న‌ల్ని ప‌ల‌కరిస్తూ ఉంటాయి.  ఒక్కో వారం ఒక్క సినిమానే ఉంట‌ది. ఒక్కోసారి రెండు మూడు ఉంటాయి. మ‌రి ఈ వారం (23.8.2019) దాదాపుగా 8 చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇక సినిమాని ప్రేమించేవాళ్ళు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళుకు ఈ రోజు పండ‌గ‌నే చెప్పాలి. అందులోనూ ఈ రోజు కృష్ణాష్ట‌మి రావ‌డంతో కొన్ని స్కూల్స్‌, మ‌రియు ఆఫీసులు సెల‌వు కూడా ఉంటాయి.  ప్ర‌స్తుతం ఉండే బిజీ లైఫ్‌లో కాసేపు ఎంట‌ర్ టైన్ అంటే సినిమాకే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తారు.  ఇక ఈ రోజు థియేట‌ర్స్ అన్నీ దాదాపుగా ఫుల్‌గానే ఉంటాయి. 


మ‌రి ఈ రోజు విడుద‌ల‌యిన చిత్రాలు అన్నీ దాదాపుగా చిన్న సినిమాల‌నే చెప్పాలి. ఈ వారం చిన్న సినిమాల పండ‌గ‌. ఎనిమిది చిత్రాలు విడుద‌ల‌యితే వాటిలో హిట్ ఏది  ఫ‌ట్ ఏది అన్న జాత‌కం మ‌రి కాసేప‌ట్లో తెలిసిపోతుంది. ఒక్కోసారి చెప్ప‌లేం చిన్న సినిమా అని అనుకుంటామ్ కాని పెద్ద క‌లెక్ష‌న్లు తెచ్చిపెడ‌తాయి. చిన్న ఆర్టిస్టులు అనుకుంటాం కానీ అనుకోకుండా కొన్ని క‌థ‌ల వ‌ల్ల సినిమా హిట్ అయితే అమాంతం పెద్ద స్టార్స్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది ప్రేక్ష‌కుడు సినిమా చూసే విధానం మారింది. క‌థ న‌చ్చితే చిన్నా పెద్దా అని తేడా లేకుండా హిట్ కొడుతున్నాయి. 


ముందుగా కౌశ‌ల్య‌కృష్ణ‌మూర్తి ఈ చిత్రానికి వ‌స్తే అది ఒక రైతు బిడ్డ పెద్ద క్రికెటర్  ఎలా అవుతుంది అన్న నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. ఒక ర‌కంగా ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు రెండు అంశాల‌ను ప్ర‌స్థావించాడు. ఒక‌టి రైతుల క‌ష్టాల‌ను గురించి చూపిస్తే మ‌రొక‌టి ఆడ‌పిల్ల‌లు అన్ని విష‌యాల్లోనూ ఏ విధంగా ముందుకు సాగుతున్నారు. అన్న విష‌యం పై క‌థ మొత్తం సాగుతుంది. మ‌రి దీన్ని ప్రేక్ష‌కులు ఏవిధంగా ఆద‌రిస్తారో చూడాలి. 


రెండో చిత్రం బాయ్ ఇది హైస్కూల్ పిల్ల‌ల మీద తీసిన చిత్రం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు టీజ‌ర్ చూశాక‌ ఏం చెప్పాల‌ని తీశాడు అన్న వితండ‌వాధం ఒక‌వైపు నుంచి వినిపించింది. ఎందువ‌ల్ల‌నంటే అందులో కొంత భాగం చిన్న వ‌య‌సులో ప్రేమ పెళ్ళి వంటి కొన్ని అంశాల‌ను చూపించ‌డంతో పెద్ద‌గా అలాంటి చిత్రాల‌ను పిల్ల‌ల‌కు చూపించ‌డానికి పెద్ద‌లు ఇష్ట‌ప‌డ‌రు. రెండోది అస‌లు ఆఖ‌రికి ఏం జ‌రిగింది  ఆ పిల్ల‌లు వాళ్ళ గ‌మ్యానికి ఎలా చేరుకుంటారు అన్న‌ది రెండో పార్ట్‌లో చూపిస్తాడు. కాని అప్ప‌టివ‌ర‌కు కూడా చూడ‌డానికి కొంత మంది ఇష్ట‌ప‌డ‌రు ఇక మ‌రి ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుతుంది అన్న‌ది కాస్త డ‌వుట‌నే చెప్పాలి. 


మూడో చిత్రం కేడి నెం.1 ఈ చిత్రం ష‌క‌ల‌క‌శంక‌ర్ హీరో గ‌తంలో తీసిన రెండు చిత్రాల‌కంటే ఇది ఎంత వ‌ర్క్ అవుట్ అవుతుందో త‌న కెరియ‌ర్‌కు ఎలాంటి పేరు తెస్తుందో మ‌రి. 


నాలుగో చిత్రం ఏదైనా జ‌ర‌గొచ్చు. శివాజీరాజా త‌న‌యుడు విజ‌య్‌రాజా హీరోగా  న‌టించిన చిత్రం . శివాజీరాజా న‌ట‌న‌ గురించి కొత్త‌గా చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు. మ‌రి వాళ్ళ అబ్బాయి ఈ చిత్రంలో ఎలా స‌క్సెస్ అవుతాడు . ఈ చిత్రం అత‌ని కెరియ‌ర్‌కి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది అన్న‌ది వెయిట్ అండ్ సీ. ఈ చిత్రం థ్రిల్ల‌ర్ స‌స్పెన్స్ జోన‌ర్‌లో కాస్త కామెడీ, రా ల‌వ్ మిక్స్ అయి ఉంటుంది. 


ఐదో చిత్రం నివాసి  ఇది ఓ ఎన్నారై క‌థ తండ్రీకొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్స్‌ని ఈ క‌థ‌లో ద‌ర్శ‌కుడు చూపిస్తాడు. గారాభంగా పెంచిన కొడుకుని. ఎటువంటి సౌక‌ర్యాలు ఇవ్వ‌కుండా త‌న మూలాల‌ను తెలుసుకోమ‌ని ఓ ప‌ల్లెటూరిలో తండ్రి వ‌దిలేస్తే దాంతో వాడి జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లో నేప‌ధ్యంలో సాగు క‌థ ఇది.  ఇలాంటి చిత్రాలు గ‌తంలో చాలానే వ‌చ్చాయి. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆకట్టుకుంటుది. ద‌ర్శ‌కుడు ఇందులో కొత్త‌గా ఏం చూపించాడ‌న్న‌ది తెలియాలి. 


ఇక నీతోనే హాయ్ హాయ్‌, హ‌వా చిత్రాలు కూడా విడుద‌ల‌య్యాయి. వాటి క‌థాక‌థాంశాలేంటి, ప్రేక్ష‌కులు ఎంత వ‌ర‌కు ఆద‌రిస్తారు. కొత్త ఆర్టిస్టుల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాలు ఆశించినంత ఫ‌లితాన్నిస్తాయా. క‌నీసం బోటా బొటీగా అన్న ఆడ‌తాయా అన్న విష‌యం పై క్లారిటీ రావాలి.


ఇక ఆఖ‌రి చిత్రం యాంగ్రీబ‌ర్డ్స్ -2 మంచులో సాహ‌సం అన్న ట్యాగ్‌లైన్‌తో విడుద‌లైన ఈ చిత్రం. ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. యాంగ్రీబ‌ర్డ్స్ మొద‌టి పార్ట్ యానిమేటెడ్ ఫుల్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కి మంచి హిట్ అయింది. మ‌రి ఈ చిత్రంలో టెక్కిక‌ల్ వ్యాల్యూస్ ఇంకా గొప్ప‌గా ఏం చూపించారు. పిల్ల‌ల‌ను ఎలా ఆక‌ట్టుకోబోతున్నారు. ఇది ఏ విధ‌మైన విజ‌యం సాధిస్తుందో చూడాలి మ‌రి. 


ఏది ఏమైన‌ప్ప‌టికీ ఎంతో క‌ష్ట‌ప‌డి తీసే సినిమాలు చిన్న‌వైనా , పెద్ద‌వైనా అటు నిర్మాత‌లు, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్లు న‌ష్ట‌పోకుండా ఉంటే స‌గం హిట్ అయిన‌ట్లే. ఇక ఈ రోజు విడుద‌లైన ఇన్ని సినిమాలు ఒకేసారి ఆడ‌తాయా లేదా అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: