ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి సినిమా ప్రేమికుడిని ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని అడిగితే, తడుకుకోకుండా వచ్చే సమాధానం "సాహో". ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్ర్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుని ఈ ఆగస్టు 30 వ తేదీన మన ముందుకు రాబోతుంది.


ఇప్పటీకే రిలీజైన టీజర్మ్ ట్రైలర్ లకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా మామూలుగా ఉండదని అర్థం అవుతోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లతో ఉన్న ట్రైలర్ అందరినీ ఆకర్షించింది. సాహో నుండి ఏది రిలీజైనా, అది ట్రెండింగ్ లోకి వస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన బ్యాడ్ బాయ్ పాట యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా రికార్డు సాధించింది.


విడుదలకు ముందే అనేక సంచలనాలు నమోదు చేస్తూ తన సత్తా చాటుతుంది. ప్రీ రిలీజ్ బిసినెస్ తోనే దుమ్మురేపిన సాహో అదే స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ విషయంలో జోరుచూపిస్తుంది. ఆస్త్రేలియాలో సాహో సినిమ అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతుందట. అలాగే పారిస్ లో గల ది గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శితమవుతున్న ప్రభాస్ రెండో సినిమాగా రికార్డులకెక్కింది. తాజాగా సాహో ట్విట్టర్ ఎమోజి సింబల్ పొంది మరో ఘనతను అందుకుంది.


ప్రముఖ సోషల్ మీడియా అయిన ట్విట్టర్ కొన్ని ప్రధాన చిత్రాలకు ఎమోజీలు తయారు చేస్తుంది. ది లయన్ కింగ్, అవెంజర్స్, స్పైడర్ మాన్, సల్మాన్ భారత్ వంటి చిత్రాలకు ఎమోజిలు తయారుచేసింది. ఇప్పుడు సాహో చిత్రానికి కూడా ట్విట్టర్ ఎమోజి ఇవ్వడం జరిగింది. ట్విట్టర్ ఎమోజి పొందిన మొదటి తెలుగు సినిమా సాహో కావడం గమనార్హం. మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: