రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మరో వారంలో ప్రేక్షకులముందుకు రానుంది. బాహుబలి తరువాత  ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా ఫై దేశ వ్యాప్తంగా  భారీ అంచనాలు నెలకొన్నాయి.  అందుకు తగ్గట్లే  ఈసినిమా అన్ని భాషల్లో  ప్రీ రిలీజ్ విషయం లో  అదరగొట్టింది.  ఇక ఇప్పుడు తాజాగా మరో  రికార్డు ను  ఖాతాలో వేసుకుంది.  ఈచిత్రం యొక్క  తెలుగు , తమిళ , మలయాళ  డిజిటల్ రైట్స్ ను  అమెజాన్ ప్రైమ్  42కోట్లకు  సొంతం చేసుకుంది.  ఇప్పటివరకు ఇదే అల్ టైం రికార్డు. 



ఇక  ట్విట్టర్ ఎమోజి  ని కలిగిన  మొదటి తెలుగు సినిమా  కూడా  సాహో నే కావడం విశేషం. కాగా  భారీ బడ్జెట్ తో  తెరకెక్కిన సినిమా కావడంతో  ఈచిత్రానికి  ఆంధ్ర ప్రదేశ్ లో  టికెట్స్ ధరలు పెంచుతున్నారని  సమాచారం.   సింగిల్ స్క్రీన్ లలో  బాల్కనీ కనీస టికెట్ ధర 200 ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణా లో ప్రభుత్వం నుండి ఇంకా  ఆమోదం లభించలేదు. 'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన  బాలీవుడ్  బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా  జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ అరుణ్ విజయ్, మందిరా భేది  తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.




భారీ బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ నిర్మించిన  ఈ చిత్రం  ఆగస్టు30న తెలుగు , హిందీ, తమిళ , మలయాళ భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలకానుంది.  ఇక సాహో తమిళ వెర్షన్  తమిళనాడు లో అయితే ఏకంగా  550 స్క్రీన్ లలో  రిలీజ్ కానుంది. ఒక డబ్బింగ్ సినిమా అక్కడ ఇన్ని స్క్రీన్ లలో  విడుదలకావడం ఇదే మొదటిసారి.  

మరింత సమాచారం తెలుసుకోండి: