వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శమ్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వాల్మీకి". తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాకి తెలుగు రీమీకే "వాల్మీకి". ఇప్పటీకే రిలీజైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ టీజర్ లో వరుణ్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా వరుణ్ మేకోవర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ తోనే అంచనాలు భారీగా పెంచేశారు.


అయితే మొన్న వాల్మీకి నుండి ఐటెం సాంగ్ ని కూడా విడుదల చేశారు. ఈ పాటలొ వరుణ్ తో పాటు తెలుగమ్మాయి డింపుల్ హయాతి స్టెప్పులేసింది. పక్కా మాస్ బీట్ కి వరుణ్ వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. మిగతా పాటలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఈ పాట మాత్రం అందరికీ నచ్చింది. అందుకే కేవలం ఒక్కరోజులోనే మిలియన్ వ్యూస్ ని దాటేసింది. ఈ పాటలో స్టెప్పులేసిన హయాతికి కన్నడలో హీరోయిన్ గా  ఛాన్స్ వచ్చిందట.


‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించిన డింపుల్ తన నటన తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇప్పుడు ఈ భామకు శాండ‌ల్‌వుడ్‌లో త‌న అదృష్టం ప‌రీక్షించుకునే స‌మ‌యం వచ్చింది. ప్రముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు చంద్ర‌మౌళి..డైరెక్ట్ చేయబోయే కొత్త చిత్రంలో ఈమెను ఎంపిక చేసాడట. ప్ర‌స్తుతం క‌న్న‌డ నేర్చుకునే ప‌నిలో బిజీగా ఉంది డింపుల్ హ‌య‌తి.


తెలుగు అమ్మాయిలకు తెలుగు లో ఛాన్సులు రానప్పటికీ, ఇతర భాషల్లో ఛాన్సులు వచ్చి వారిని బిజీ హీరోయిన్ ను చేసేస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో  చాలామంది తెలుగు భామలు బిజీ అయ్యారు. అంజలి, బిందు మాధవి శ్రీదివ్య, మొదలగు వారు తమిళంలో స్టార్ హీరోలతో నటించిన వారే.  మరి హ‌య‌తి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: