ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ ఇటీవల దిల్ రాజ్ నిర్మాణంలో ‘లవర్’సినిమాతో వచ్చాడు.  ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించ లేక పోయింది.  ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్ పై సోషల్ మీడియాలో రక రకాల వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.  సోమవారం రాత్రి అలకాపురి టౌన్ షిప్ వద్ద సినీ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు.

రెండు రోజుల తర్వాత ట్విట్టర్ వేధికగా తాను క్షేమంగా ఉన్నానని..సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే తాను బతికిపోయానని..కారు నడిపేవారు తప్పనిసరిగా సీటు బెల్టు, బైక్ నడిపే వారు హెల్మెట్ పెట్టుకోవాలని సలహా కూడా ఇచ్చాడు. రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసు మరో మలుపు తిరిగింది. యాక్సిడెంట్‌ వీడియోలు మీడియాకు ఇస్తానని డిజైనర్‌ కార్తీక్‌ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడని రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర గురు వారం మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  ఒక ఛానల్ లో రాజ్ తరుణ్ తాగి డ్రైవ్ చేశాడని దానికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు. వాటిని బయటపెట్టకుండా ఉండడానికి తనతో డీల్ మాట్లాడారని కార్తిక్ సంచలన కామెంట్స్ చేశారు.

మరోవైపు రాజా రవీంద్ర వెర్షన్ మరో విధంగా ఉంది. కార్తిక్ ఎవరో తనకు తెలియదని.. అలాంటప్పుడు అతడికి ఫోన్ ఎలా చేస్తానని ప్రశ్నించాడు రాజారవీంద్ర.  వీడియోలు తీసివేయాలని తాము బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డామని ఆరోపించడంలో నిజం లేదన్నారు. తనకు, రాజ్‌ తరుణ్‌కు,సినీ పరిశ్రమ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన కార్తీక్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాజా రవీంద్ర ఫిర్యాదులో కోరారు. గతంలో కార్తిక్.. హీరో సందీప్ కిషన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశాడని.. అతడిపై 498A సెక్షన్ కింద కేసు నమోదైందని చెప్పారు. 

అలాంటి క్రిమినల్ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నవారే నేరాలకు పాల్పపడతారని..రాజ్ తరుణ్  ఇప్పటికే ఆ విషయంలో బాదపడుతూనే ఉన్నాురని అన్నారు.  క్రిమినల్ ఇంటెన్షన్స్ ఉన్న కారణంగా అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడని రాజారవీంద్ర అన్నారు. అయితే ఈ విషయాలను కార్తిక్ కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై లీగల్ ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు రాజ్ తరుణ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: