నిన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మొన్న సాయంత్రం హైదరాబాద్, శిల్పకళావేదికలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ సహా, పలువురు మెగాస్టార్ కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ వేడుకలకు విశేషంగా మెగా ఫ్యాన్స్ తరలి రావడం జరిగింది. అయితే ఈ వేడుకలకు నాగబాబు హాజరు కాకపోవడంతో కొంత అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ విషయమై నేడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం నా ఛానల్ నా ఇష్టం పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్  ప్రారంభించిన నాగబాబు, నేడు అదే ఛానల్ ద్వారా మెగాస్టార్ జన్మదిన వేడుకలకు రాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. 

చిన్నప్పటినుండి ప్రతి ఏడు, తమ అమ్మ అంజనా దేవి గారు, అన్నయ్య చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించేవారని, ఆయన సినిమాల్లోకి ప్రవేశించి హీరో అయ్యాక, మెగా ఫ్యాన్స్ అందరూ ఆయన జన్మదినాన్ని ఒక పండుగలా నిర్వహించడం మొదలెట్టారని అన్నారు. అయితే మొన్నటి వేడుకలకు హాజరు కాకపోవడానికి, తాను అదే సమయంలో విదేశాల్లో ఉండడమే కారణం అని, ఆ వేడుకల్లో నేను కూడా ఉండి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యానని అన్నారు. అయితే, అన్నయ్యపై తనకు ఎప్పటికీ ప్రేమ, అభిమానం అలానే ఉంటుందని, చిన్నప్పటి నుండి నాకు, పవన్ కు ఎన్నో మంచి పద్ధతులు, క్రమశిక్షణ నేర్పారని, అంతేకాక ఆయన వల్లనే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక అన్నయ్య మెగాస్టార్ గా టాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ, 

ఆయన విషయమై ఒక లోటు మాత్రం మా అందరిలోనూ ఇప్పటికీ ఉందని అన్నారు. కొన్నేళ్ల క్రితం బాలచందర్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రవీణ సినిమాలో అన్నయ్య పోషించిన పాత్రకు అప్పట్లో ఎన్నో ప్రశంశలు దక్కాయని, అయితే ఆ సినిమాకు తప్పకుండా జాతీయ అవార్డు వచ్చి తీరుతుందని అందరం భావించాం, కానీ చివరకు ఆయనకు అవార్డు దక్కకపోవడం చాలా బాధ కలిగించిందని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక ఎంతో కష్టపడి ప్రస్తుతం ఆయన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారని, ఈ సినిమాలో ఆయన కనబరిచిన అద్భుత నటనకు తప్పకుండా ఈసారి ఆయనకు జాతీయ అవార్డు వస్తుందని భావిస్తున్నట్లు నాగబాబు తెలిపారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: