మెగాస్టార్ చిరంజీవికి మ్యూజిక్ సెన్స్ ఎక్కువని చెప్పటానికి ఆయన సినిమాల్లోని పాటలే ఉదాహరణ. చిరంజీవి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ మెగాస్టార్ కు వీనులవిందైన పాటలెన్నో ఇచ్చారు. రాష్ట్రాన్ని ఊపేసిన చిరంజీవి వీణ స్టెప్ పాటకు మ్యూజిక్ ఇచ్చింది కూడా మణిశర్మే. చిరంజీవితో ఆయనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వూలో పంచుకున్నారు.

 


చిరంజీవి కామెడీ చేస్తే బ్రహ్మానందం కూడా తట్టుకోలేరని మణి అన్నారు. గతంలో ఓసారి ఇదే మాటను ప్రభుదేవా కూడా అన్నాడు. చిరంజీవి చేసే కామెడీని ప్రజలు పూర్తిగా చూడలేదని, ఆయనలోని కామెడీ టైమింగ్ అద్భుతమని అన్నారు. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా అన్నయ్యతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. కావాలంటే తన ఆర్కెస్ట్రా ఖర్చులన్నీ భరిస్తానని ఆడియో రిలీజ్‌ వేడుక కూడా తానే ఏర్పాటుచేస్తానని తన అభిమానాన్ని చాటుకున్నారు. అన్నయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇస్తే తనకు తెలిసిన బీట్స్‌ అన్నీ వాడేస్తానన్నారు. తమ కాంబినేషన్‌లో ఏది బెస్ట్‌ సినిమా అనే ప్రశ్నే అనవసరం అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో తాను ‘అన్నయ్యా..’ అని పిలిచేది ఇద్దరినేనని వారిలో చిరంజీవి ఒకరని చెప్పి చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

 


చిరంజీవి – మణిశర్మ కాంబినేషన్ లో పది సినిమాలు వచ్చాయి. 1996లో చిరంజీవి-ఆర్జీవీ కాంబోలో సినిమాతో మణి పరిచయమై రెండు పాటలు ట్యూన్ చేశాక ఆ సినిమా ఆగిపోయింది. దీంతో బావగారూ బాగున్నారా చిత్రంతో మెగాస్టార్ తో మణి ప్రయాణం ప్రారంభమైంది. ఈ సినిమా సూపర్ హిట్. చూడాలని ఉంది కి మణి ఇచ్చిన మ్యూజిక్ చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటి. చిరంజీవి – మణి కాంబోలో సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారడంలో సందేహం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: