స్టయిలిష్  స్టార్ అల్లు అర్జున్ సినిమాలను వరుసగా ఒప్పుకుంటున్నారు.  నా పేరు సూర్య సినిమా ఘోరపరాజయం అయినా తరువాత దాదాపు సంవత్సరం పాటు సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ కానుంది.
 త్రివిక్రమ్ సినిమా తరువాత ఐకాన్ మూవీ షూటింగ్ మొదలవుతుంది. అందువల్ల చిత్ర యూనిట్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇందులో రెగ్యులర్  హీరోయిన్స్ వద్దని , రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌ చరణ్‌ సరసన నటిస్తోన్న బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ వుండాలని అల్లు అర్జున్‌ కోరాడట. దాంతో నిర్మాత దిల్‌ రాజు అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడట. అసలే సుకుమార్‌ సినిమా కూడా లైన్లో వుండడంతో 'ఐకాన్‌' డిలే కాకుండా వుండేందుకు దిల్‌ రాజు చాలా కృషి చేస్తున్నాడు. 
ఆలియా భట్ ను హిరోయిన్ గా ఒప్పిస్తే సినిమా తొందరగా మొదలవుతుంది. ఎందుకంటే ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ కనుక హీరో, హీరోయిన్ మధ్యలో సీన్స్ ఎక్కువగా  ఉంటాయి. ఐకాన్ లో హీరొయిన్  క్యారెక్టర్  చాలా ఇంట్రస్టింగ్ వచ్చిందట. కానీ ఆలియకి కి క్యారెక్టర్ గురించి వివరించిన  ఆమె ఆసక్తి చూపించడం లేదు.
దానికి కారణం ఆమె డేట్స్ దాదాపు రెండు సంవత్సరల వరకు ఖాళిగా లేవు. ఆమె ప్రస్తుతం సడక్౨, 'ఆర్‌ఆర్‌ఆర్‌', రణబీర్ కపూర్ సరసన బ్రహ్మస్ర్త,షంషేర్ లలో నటిస్తుంది. ఇవి అన్ని భారీ బడ్జట్ సినిమాలు  . అందువల్ల ఆమె ప్రస్తుతం కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు .ఈ సినిమాలపై మాత్రమే దృష్టి పెడుతుందట. అందువల్ల ఆలియా కాకపోతే అంత పాపులర్‌ అయిన హిందీ తారనే ఒప్పించి తీసుకురావాలని దిల్‌ రాజు తన ప్రయత్నాలు చేస్తున్నారంట.అల్లు అర్జున్ ప్రక్కన ఏ బాలీవుడ్ భామ "ఐకాన్" మూవీలో మెరుస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: