ననయతార. అందాల తార. ఆమె పన్నెండేళ్ళుగా వెండితెర వేలుపుగా అలరిస్తోంది. ఆమె హీరోయిన్ అంటే చాలు కుర్ర కారులో హుషార్ పుడుతుంది. తన అందాన్ని అలాగే మెయింటైన్ చేయడంతో పాటు, నటనలో ఎప్పటికపుడు మెరుగులు దిద్దుకుంటూ నయన్ చూపించే హావభావాలను హీరోలే ఫిదా అవుతారు. అందుకే ఆమెకు ఎన్నో హిట్లు, ఇక హీరోలతో నాకు పనేంటి అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి సత్తా చాటుకున్న గ్రేట్ హీరోయిన్ నయన్.


ఆమెను ముందు అప్రోచ్ కావాలంటేనే నిర్మాతలు, డైరెక్టర్లు మంచి కధను ముందుంచుకుని వెళ్తారు. తాను పెట్టే షరతులకు కూడా రెడీ అంటారు. ఆ షరతులు ఏంటి అంటే సినిమా ప్రమోషన్లో అసలు పార్టిసిపేట్ చేయకపోవడం. సినిమాకు సంబంధించి తన పాత్రను తాను చేసి వెళ్ళిపోవడం. ఇక హీరోతో రొమాన్స్ ఉండాలా వద్దా కూడా నయనే నిర్ణయిస్తుంది. ఆమె షరతుల మేరకే కధను డిజైన్ చేసుకుంటారు. 


ఇక ఆమెతో షూటింగ్ పెట్టుకుని  ఓ టాలీవుడ్ హీరో  ఇబ్బందులు పడిన ఉదాహరణలూ ఉన్నాయి. చివరికి సాంగ్ క్యాన్సిల్ చేసుకుని సినిమాను ముంగించేశారంటే నయన్ అంటే ఏంటో అర్ధమవుతుంది. ఇంకో టాలీవుడ్ హీరో అయిదేళ్ళు ఆమె కోసం అడుగుతూనే ఉంటే ఆయన సినిమాలో గెస్ట్ రోల్ గా చేసేసి భారీ పారితోషికం డిమాండ్ చేసింద్ నయన్. ఇక నయన్ ఇపుడు ఎక్కువగా కోలీవుడ్ మీదే ద్రుష్టి పెట్టింది. అయితే ఆమెతో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేయలేదు. 


ఆమె 2005లో ఎంట్రీ ఇస్తే చిరంజీవి ఆ తరువాత రెండేళ్ళకు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. దాంతో ఈ క్రేజీ కాంబోను రాం చరణ్ సెట్ చేసి సైరా నర సింహారెడ్డిలో చూపిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఫంక్షన్లో అంతా వచ్చినా కూడా నయన్ హ్యాండ్ ఇచ్చేసింది. మెగా మూవీ అయినా నాకేంటి అన్నట్లుగా నయన్ వుండడమే ఇక్కడ విశేషం. తమన్నా దగ్గర నుంచి ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతీ వారూ వచ్చారు కానీ  నయన్ రాకపోవడం మెగా షాకే మరి. ఇక నయన్ ఈ మూవీలో మంచి ఇంపార్టంట్  రోల్ కూడా ప్లే చేసి డుమ్మా కొట్టడంతో మెగా క్యాంప్ గుస్సా అవుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: