సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి విషయం గురించి సోషల్ మీడియాలో తెలుసుకుంటున్నారు.  ఏ విషయంపైనా ట్యాగ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తే.. దానిపై వందలాది పోస్టులు క్రియేట్ అవుతుంటాయి. ట్యాగ్ వైరల్ అయ్యింది ఇక ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది.  అందుకే సోషల్ మీడియాకు అంతటి పేరు వచ్చింది.  సామాన్యుల దగ్గరి నుంచి మోడీ స్థాయి వాళ్ళ వరకు సోషల్ మీడియాలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు.  


అయితే, ఇప్పుడు 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఏ ట్యాగ్ టెండింగ్ అయ్యిందో తెలియజేస్తూ.. ఓ నివేదికను రిలీజ్ చేసింది.  ఆ నివేదిక ప్రకారం.. అజిత్ హీరోగా చేసిన విశ్వాసం సినిమా టైటిల్ అత్యధికంగా ట్రెండ్ అయ్యింది.  లోక్ సభ ఎన్నికల సమయంలో లోక్ సభ ట్యాగ్ కంటే కూడా అజిత్ విశ్వాసం ట్యాగ్ ట్రెండ్ కావడం విశేషం.  


ఈ సినిమా ట్యాగ్ తరువాత స్థానంలో లోక్ సభ ట్యాగ్ ఉన్నది.  దీని తరువాత వరల్డ్ కప్ ట్యాగ్.. నాలుగో స్థానంలో మహేష్ బాబు మహర్షి సినిమా ట్యాగ్ ఉండటం విశేషం. ఇక ఐదో స్థానంలో న్యూ ప్రొఫైల్ పిక్ అనే ట్యాగ్ నిలిచింది.  టాప్ 5 ట్రేండింగ్ ట్యాగ్స్ లో రెండు సినిమా ట్యాగ్స్ ఉండటం విశేషం.  సాధారణంగా ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన ట్యాగ్స్ ట్రెండ్ కావాలి.. 


కానీ, అజిత్ మూవీ ట్యాగ్ ఇలా బీట్ చేయడం గొప్ప విషయం అని చెప్పాలి.  అనుకున్నట్టుగానే విశ్వాసం సినిమా తమిళనాడులో ఎన్నో సంచలనాలు సృష్టించింది.  అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది.  రోబో 2పాయింట్ 0 భారీ వసూళ్లు సాధిస్తుంది అనుకుంటే.. ఈ సినిమా 3డి వెర్షన్ సినిమా వచ్చింది.. కాబట్టి కొందరిని మాత్రమే ఆకట్టుకుంది.  తమిళనాడులో చాల థియేటర్లు 2డి థియేటర్లే.  ఇది ఆ సినిమాకు మైనస్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: