టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయం రీసెంట్‌గా క్షణం, గూఢచారి సినిమాలు రుజువు చేశాయి. ఆ రెండు సినిమాలు కూడా అడివి శేషు హీరోగా రావడంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే రెజీనా కసండ్రా ఉండటంతో మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. పీవీపీ బ్యానర్ ఈ సినిమాను రూపొందించడం మరింత ఆకర్షణగా మారింది. ఇలాంటి పరిస్థితులు మధ్య రిలీజైన ఎవరు సినిమా అడివి శేషుకు మరో సక్సెస్‌ను అందించింది. ఈ చిత్రంతో రెజీనా కూడా మళ్లీ సక్సెస్ స‌క్సెస్ బాట ప‌ట్టింద‌నే చెప్పాలి. పీవీపీ ఖాతాలో మరో విజయం వేసుకోవ‌చ్చు. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రం మంచి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో విలేక‌రుల స‌మావేశ‌లో...


రైట‌ర్ అబ్బూరు ర‌వి మాట్లాడుతూ...ఈ సినిమా హిట్ అయ్యాక అవ‌డి శేష్‌ని థ్రిల్లింగ్ స్టార్‌, బ‌డ్జెట్ స్టార్ అన్నారు.  థ్రిల్లింగ్ స్టార్ వ‌ర‌కు ఓకే బ‌డ్జెట్ స్టార్ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే త‌ను ఇంకా బాగా క‌ష్ట‌ప‌డాలి. ఈ స్టేజ్ మీద ప్ర‌స్తుతం అంద‌రూ చాలా ఆనందంగా నవ్వుతూ క‌నిపిస్తున్నారు. కానీ దీని వెనుక చాలా క‌ష్ట‌ముంది. ఇంత‌టి విజ‌యం సాధించ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇందులో ప్ర‌తి ఒక్క‌రం ఒక‌రిపై మ‌రొక‌రు కోపం తెచ్చుకున్న‌వారే. అంద‌రం తిట్టుకున్న‌వాళ్ళ‌మే. శేష్‌, వెంక‌ట్‌రాంజీ అయితే బాగా అలిగారు కూడా ఒక‌రి పై ఒక‌రు. అలిగి వెళ్లిపోయారు. ఇగో ప్రాబ్ల‌మ్స్ కాని ఫైన‌ల్‌గా సినిమా గెలిచింది.  మా సినిమాటోగ్రాఫ‌ర్‌ని అంద‌రూ వంశీ పచ్చిపులుసుని ఇంటిపేరుతో ప‌చ్చిపులుసు అని స‌ర‌దాగా పిలుస్తున్నారు. నన్ను మా ఫ్రెండ్స్ ఎవ‌రన్నా స‌ర‌దాగా అబ్బూరి ర‌వి క‌దా నా పేరు స‌ర‌దాగా బూరి అనేవాళ్ళు నేను వాళ్ల‌ను కొట్టేసేవాడ్ని అలా పిలిస్తే నాకు చాలా కోపం వ‌చ్చేది. కాని మా వంశీ అలా కాదు. ఎలా పిలిచినా చ‌క్క‌గా న‌వ్వుతూ ఉంటారు. త‌న సినిమాటోగ్ర‌ఫీ కూడా ఈ చిత్రంలో చాలా బాగా వ‌చ్చింది అని అన్నారు. అలాగే త‌ను ఈ సినిమా చూసిన త‌ర్వాత రెజీనా ఫ్యాన్ అయిపోయాన‌ని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: