టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఆయన కెరీర్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి సినిమా, ఇటీవల మే9వ తేదీన విడుదలై అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాతలైన అశ్వినీదత్, దిల్ రాజు, పివిపిలు కలిసి, సంయుక్తంగా తమ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, 

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. స్నేహం బంధం విలువను తెలియచెప్తూ, అలానే దేశానికి వెన్నెముకైన రైతన్నల గురించి ఒక అద్భుతమైన మెసేజిని అందించిన ఈ సినిమా, రిలీజ్ అయిన తొలిరోజున కాస్త మిక్స్డ్ టాక్ సంపాదించినప్పటికీ, ఆ తరువాత నుండి మెల్లగా పుంజుకుని, విపరీతమైన ప్రేక్షకాభిమానం మరియు అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోయింది. కొద్దిరోజుల క్రితమే సక్సెస్ ఫుల్ గా మూడు కేంద్రాల్లో 100 రోజుల వేడుక జరుపుకున్న ఈ సినిమా, నేడు ఒక అరుదైన రికార్డు ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుండి జూన్ 30వరకు, అంటే గడిచిన ఈ ఆరు నెలల్లో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం, ట్విట్టర్ లో ఇండియా వైజ్ గా ఇప్పటివరకు అత్యధికులు వాడిన హ్యాష్ ట్యాగ్ గా 

'మహర్షి' నాలుగవ  స్థానాన్ని దక్కించుకుని సెన్సేషనల్ రికార్డు ని నెలకొల్పడం జరిగింది. అయితే ఈ రికార్డు లిస్టులో మొదటి స్థానంలో తమిళ నటుడు తలా అజిత్ నటించిన 'విశ్వాసం' నిలవగా, రెండు మరియు మూడవ స్థానాల్లో '2019 లోక్ సభ ఎలక్షన్స్', మరియు '2019 క్రికెట్ వరల్డ్ కప్' నిలిచాయి. ఇక మహర్షి ఇంతటి అద్భుత రికార్డు సాధించడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు పై, అలానే మహర్షి సినిమా యూనిట్ పై పలువురు సినిమా ప్రముఖులు మరియు నెటిజన్లు సర్వత్రా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పొగడ్తలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: