యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల సక్సెస్ తరువాత బాలీవుడ్ బడా హీరోస్ రేంజి ఫాలోయింగ్ మరియు మార్కెట్ ను సంపాదించడం జరిగింది. ఇకపోతే ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం సాహో, ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని మరికొద్దిరోజుల్లో రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లకు ఇది ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ సినిమా అనే విధంగా ఆ ట్రైలర్ రూపొందడంతో, అప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఎన్నో ప్రత్యేకతలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. 

ఈనెల 30వ తేదీన అత్యంత భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా పైనే మరికొందరు స్టార్ హీరోల భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు. వారు చెప్తున్న వివరాల ప్రకారం, బాహుబలి రెండు భాగాల విజయాల తరువాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయిందని, అంతేకాక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా సాహో సినిమా, రేపు రిలీజ్ తరువాత మంచి విజయాన్ని అందుకుంటే, నిర్మాతలకు కాసుల వర్షం కురియడం తోపాటు ప్రభాస్ పేరు మరింతగా దేశ, విదేశాల్లో మారుమ్రోగుతుందని అంటున్నారు. అయితే ఇక్కడే మరొక పెద్ద సమస్య కూడా దాగి ఉందని వారు అంటున్నారు, అదేమిటంటే, ఇప్పటివరకు విపరీతమైన అంచనాలు ఏర్పరుచుకున్న ఈ భారీ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఏ మాత్రం అంచనాలు అందుకోలేక చతికిల పడినా, ఆ ప్రభావం తదుపరి మన టాలీవుడ్ నుండి రానున్న బడా సినిమాలైన సైరా మరియు ఆర్ఆర్ఆర్ సినిమాల పై కొంతైనా ఖచ్చితంగా కొంతైనా ఉంటుందని అంటున్నారు. 

ఒకవేళ అదే జరిగితే, అక్టోబర్ లో రిలీజ్ కానున్న సైరా బిజినెస్ పై కొంత నెగటివ్ ప్రభావం పడే ఛాన్స్ ఉందని, అలానే వచ్చే ఏడాది జులై లో రిలీజ్ కాబోయే ఆర్ఆర్ఆర్ బిజినెస్ కూడా కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు. అయితే వారు చెప్తున్నట్లు ఖచ్చితంగా అలానే జరగాలని రూల్ లేదని, కాకపోతే ఏదైనా భారీ రేంజ్ సినిమా మీద అత్యధిక అంచనాలు ఉండి, రిలీజ్ తరువాత ఆ అంచనాలు కనుక అందుకోలేక ఆ సినిమా ఫ్లాప్ అయినపుడు, దాని తరువాత రిలీజ్ అయ్యే మిగతా ఇతర  భారీ సినిమాల పై ఆ సినిమా ప్రభావం పడిన సందర్భాలు గతంలో ఎదురయిన విషయాన్నే తాము గుర్తుచేస్తున్నాం అని వారు అంటున్నారు. అయితే తమకున్న సమాచారం బట్టి, సాహో విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, తప్పకుండా ఆ సినిమా సక్సెస్ సాధించి, మన తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుంటున్నట్లు వారు అంటున్నారు. మరి ప్రభాస్ తనపై ఉన్న ఈ అతి పెద్ద భారాన్ని ఎంతవరకు సఫలం చేసి, మిగతా టాలీవుడ్ హీరోలకు దారి సుగమం చేస్తారో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: