మహిళలపై లైంగిక వేధింపులు కేవలం సినిమా రంగంలోనే ఉందని అనుకున్నాం .. కానీ ఇప్పుడు అది బుల్లితెర పై కూడా ఉందంటూ బిగ్ బాస్ కంటస్టెంట్, ప్రముఖ బుల్లితెర నటి రోహిణి పెద్ద బాంబు పేల్చింది. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను లోబరచుకునేందుకు కొందరు నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు కాస్టింగ్ కౌచ్ పేరుతొ ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇప్పటి సమస్య కాదని ఎప్పటి నుండో ఉందని చెప్పింది.తాజాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన రోహిణి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..


ప్రస్తుతం సినీరంగంలోనే కాదు టీవీ రంగంలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉందంటూ కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసింది. అలాగే.. ఇంజనీరింగ్ పూర్తీ చేసిన తాను హైద్రాబాద్ వచ్చి ముందుగా జాబ్ చేశానని.. ఆ తరువాత కొన్ని రోజులకు ఆఫర్స్ వచ్చాయని, ఓ అవకాశం కోసం సీరియల్ ఆడిషన్ కు కూడా వెళ్లానని ఆ సీరియల్ నిర్మాతలు నన్ను ఎటువంటి మొహమాటం లేకుండా కమిట్మెంట్ అడిగారని చెప్పింది. వాళ్ళు అలా అడగడంతో విస్తుపోయిన నేను కోపంగా అక్కడినుండి వచ్చేసానని తెలిపింది. ఆ తరువాత ఇలాంటి అనుభవాలే రెండు మూడు చోట్ల ఎదురయ్యాయని రోహిణి తెలిపింది.


టీవీ సీరియల్స్ లో నటించేందుకు కూడా అవకాశాల కోసం అడ్డమైన పనులు చేయాల్సి వస్తుందని రోహిణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే.. తన అంకుల్ రికమండ్ చేసిన ఓ ఆఫీస్ కు వెళితే అక్కడ కూడా ఓ మేనేజర్ కమిట్మెంట్ అడిగాడని.. ఆ విషయమే తన అంకుల్ తో చెబితే అతడిని మందలించాడని చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ అడిగేవారిపట్ల తాను నాకు చదువువుంది, టాలెంట్ వుంది అని నిక్కచ్చిగా మొహం మీదే చెప్పి వచ్చేదాన్ని అని తెలిపింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులను గూర్చి, తన ఎలిమినేషన్ గూర్చి కొన్ని విషయాలను ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: