నందమూరి కళ్యాణ్ రాం హీరోగా శతమానం భవతి సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. ఈ సినిమాలో కళ్యాణ్ రాం కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. 118 సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న కళ్యాణ్ రాం ఈసారి క్లాసిక్ డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.


సినిమా టైటిల్ చూసే ఇది కూడా శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం సినిమాల్లానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తాయని అనిపిస్తుంది. అయితే శతమానం భవతి సూపర్ హిట్ అవగా శ్రీనివాస కళ్యాణం సినిమా నిరాశపరచింది. అయితే ఈ ఎంత మంచివాడవురా సినిమా మాత్రం తప్పకుండా మెప్పిస్తుందని అంటున్నారు.


అంతేకాదు కళ్యాణ్ రాం సినిమా ఓ గుజరాతీ సినిమా రీమేక్ అని అంటున్నారు. గుజరాతి భాషలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఆక్సీజన్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. చిన్మయ్ పురోహిత్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అన్షుల్ త్రివేది హీరోగా నటించాడు. హెమీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.


అయితే అంత హెవీ ఎమోషన్ మన తెలుగు వాళ్లకు నచ్చుతుందో లేదో అన్న డౌట్ వస్తుంది. సతీష్ వేగేశ్న సినిమా మూల కథను మాత్రమే తీసుకుని దాన్ని తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథ రాసుకున్నాడట. అయితే ఎంత మంచివాడవురా చిత్రయూనిట్ మాత్రం ఈ కాపీ వార్తలను అసలు పట్టించుకోవడం లేదు.  సినిమాలో హీరో తనకు కావాల్సిన వాళ్లకే కాక తనకు తెలియని వాళ్లకు కూడా మంచి చేస్తాడట. ఇదే ఎంత మంచివాడవురా సినిమా కథ అని తెలుస్తుంది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: