ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా..బాలీవుడ్ నిర్మాతలు ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ.  ఆ మద్య యష్ హీరోగా నటించిన కన్నడ మూవీ ‘కేజీఎఫ్’ బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.  తర్వాత సౌత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ రిలీజ్ చేస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి మెగాస్టార చిరకాల కోరిక.

సైరా నరసింహారెడ్డి మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ నటించిన మూవీ తొలిసారి సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుండడం విశేషం. బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మొట్టమొదటి తెలుగు తేజం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  చరిత్ర పుటల్లో ఎంతో మంది వీరుల పేరు భారతీయులందరికీ తెలిసిందే..కానీ చరిత్రకు తెలియని ఓ మహాయోధుడి వీర గాధ అందరికీ తెలియాలని ఈ సినిమా తీస్తున్నామని మెగాస్టార్ ఎన్నో సార్లు చెప్పారు.

ఈ మూవీ ప్రమోషన్ చిరు, రాంచరణ్, ఇతర చిత్ర యూనిట్ బిజీగా గడుపుతున్నారు. హిందీలో ఈ మూవీ ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కెజిఎఫ్ తర్వాత మరో సౌత్ ఇండియన్ సినిమా సైరాని రిలీజ్ చేయడానికి కారణం ఈ చిత్ర కథే అని ఫరాన్ తెలిపాడు.  బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించిన వారిలో సిపాయి తిరుగు బాటు గురించి విన్నాం..కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంతకు ముందే బ్రిటీష్ సైన్యంతో పోరాడిన విషయం తెలిసిన తర్వాత మా రోమాలు నిక్కబొడిచాయని..అంత గొప్ప వీరుడు కథ ఎవరికీ తెలియకపోవడం దారుణం అని వారన్నారు. ఇక బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ మూవీ ప్రాంతంతో బేధం లేకుండా ఆదరిస్తారని నమ్మకం కలిగినట్లు ఫరాన్ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: