తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వచ్చేవారం ఈ చిత్రంలోని రెండో సాంగ్ ను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో బాలయ్య - సోనాల్ చౌహాన్ పాల్గొననున్నారు. సాంగ్ లో మంచి రొమాంటిక్ బిట్స్ తో పాటు మంచి డాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయట. శనివారం నుండి డాన్స్ ప్రాక్టీస్ ఉంటుందట. మొత్తానికి బాలయ్య ఈ వయసులో కూడా డాన్స్ చేయటానికి ఏ మాత్రం వెనుకాడటంలేదు. కాగా బాలయ్య ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అయితే ఇటివలే బాలయ్య బాబు లుక్ కి సంబంధించిన ఫోటో వైరల్ గా అయిన సంగతి తెలిసిందే. డాన్ క్యారెక్టర్ కి సంబంధించిన సరి కొత్త లుక్ లో బాలయ్య అచ్ఛం ఐరన్ మాన్ లా ఉన్నాడు. మరి రెండో లుక్ లో ఎలా ఉంటాడో చూడాలి.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. అయితే వేదిక మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుందట. ఈ సినిమాలో బాలయ్య - వేదిక ట్రాక్ బాగా ఎమోషనల్ గా సాగనుందని సమాచారం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అభిమానులు మాత్రం ఈ టైటిల్ను బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికైనా ఆ టైటిల్ తో బాలయ్య సినిమా చేస్తే బాగుండని ఆశపడ్డారు. మరి వారి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. గతంలో ఈయన బాలయ్యతో కలిసి 'జైసింహ' అనే చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. అలాగే ఈ చిత్రంలో భూమిక , ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.