బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత హిట్ వచ్చింది.ఆయన హీరో గా నటించిన సూపర్ ౩౦ మూవీ విజయం సాధించింది. సూపర్ ౩౦ సినిమా ప్రముఖ గణితశాస్త్ర నిపుణుడు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆదారంగా రూపొందింది. సూపర్ ౩౦ దాదాపు ౧౫౦ కోట్లు కలక్షన్స్ సాధించింది. హృతిక్ రోషన్ కి రీసెంట్ గా ప్రపంచంలోనే నెం.1 అందగాడిగా అరుదైనా గౌరవం దక్కింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫిల్మ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లాడించారు.


ప్రస్తుతం హృతిక్ రోషన్  టైగర్ ష్రాఫ్ తో కలిసి వార్ అనే యక్షన్ మూవీ లో నటిస్తున్నారు.  యాష్ రాజ్ ఫిల్మిస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సిద్దార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు ది. ఈ దసరా కి సైరా కి పోటిగా వార్  రిలీజ్ అవుతుంది. సక్సెస్ఫుల్ క్రిష్ సిరిస్ లో నాల్గవ భాగం ఎప్పుడు అని రిపోర్టర్ అడిగిన  ప్రశ్నకు హృతిక్ రోషన్, క్రిష్ రోల్ చేయడానికి నేను చాలా ఉత్సహంగా ఉన్నాను. కానీ ఆ సినిమా ను  భారీ బడ్జట్ తొ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో తీయలని అనుకుంటున్నాం.సినిమాను తీస్తే   ఆ లెవల్ కి మ్యాచ్ అయ్యేలా తీస్తాం. లేకపోతే సినిమాను తీయడంలో అర్థం లేదు . క్రిష్ 4 స్ర్కీప్ట్ రెడీగా ఉంది. అని అన్నారు. నా  ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను అందులో నుండి ఎదో ఒక కథను ఎంచుకోవాల్సి ఉంది.
 
1982లో   స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ఈ.టి సినిమా 2003లోవచ్చిన "కొయి మిల్ గాయ" మొదటి భాగనికి  స్పూర్తి. క్రిష్ సినిమా ఇండియాలో మొదటి సూపర్ హీరో మూవీ. క్రిష్ సినిమాకి ఇప్పటికి మూడు భాగాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కమర్షల్ గా మంచి విజయం సాధించాయి.
   


మరింత సమాచారం తెలుసుకోండి: