టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారే ఆఖరి నెంబర్ వన్ అని గతంలో ఒక సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పకనే చెప్పారు. అలానే పవన్ కూడా నేను, అటువంటివి పెద్దగా నమ్మను, నా దగ్గరకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నాకు అలవాటు అంటూ ఆయన కూడా ఇదివరకు పలు ఇంటర్వూస్ లో చెప్పడం జరిగింది. ఇక ఎప్పటికపుడు మెగాస్టార్ తరువాత ఎవరు నెంబర్ వన్ అనే వాదన తెరపైకి వచ్చినప్పుడల్లా, ఎక్కువశాతం అయితే మహేష్ బాబు, లేదా పవన్ కళ్యాణ్ పేర్లే వినిపిస్తుండడం జరుగుతుంది. ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారు. 

అందరికంటే ఎవరిది పైచేయిగా నిలిచి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు అనే విషయమై జరిగిన ఒక సర్వే లో, మళ్ళి మహేష్, పవన్ లే ముందు వరుసలో నిలిచినట్లు సమాచారం. నిజానికి తాము నటించే సినిమాలకు పారితోషికం రూపంలో కొంత, అలానే లాభాల్లో మరికొంత వాటాలు తీసుకునే అలవాటున్న ఈ ఇద్దరు హీరోలు, ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.55 కోట్లవరకు పుచ్చుకుంటారని అంటున్నారు. ఇక వారి తరువాత స్థానాల్లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ నిలుస్తారట. అయితే ఈ విషయంలో ప్రభాస్ ని కాస్త మినహాయించాలని అంటున్నారు. ఎందుకంటే ఆయన బాహుబలి రెండు భాగాల రిలీజ్ తరువాత ఇపుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయారు కాబట్టి, ఆయన సాహో నుండి రెమ్యూనరేషన్ రూపములో మరింత ఎక్కువ తీసుకునే అవకాశం ఉందనేది వారు చెప్తున్న మాట. 

ఇక ప్రభాస్ ను మినహాయిస్తే, వారికందిన ఈ లెక్కల ప్రకారం అయితే మహేష్, పవన్ లదే హవా అంటున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి, పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు, అలానే ప్రజా సేవకు అంకితం చేసిన పవన్, ఇకపై సినిమాల్లోకి దాదాపుగా వచ్చే అవకాశమే లేదని అర్ధం అవుతోంది. అందువలన ప్రస్తుతం వరుసగా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్, రాబోయే రోజుల్లో మరింతగా సక్సెస్ లు సాధిస్తే, భవిష్యత్తులో అత్యధిక పారితోషికం అందుకున్న టాలీవుడ్ హీరోగా ఆయన రికార్డు నమోదు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: