తెలుగు వారికీ రామానాయుడు స్టూడియో, అన్న‌పూర్ణ స్టూడియో ఎంత ప్ర‌ధానంగా వినిపించే పేర్లో బాలీవుడ్‌లో కూడా రాజ్ క‌పూర్ ఫిల్మ్ స్టూడియో అంతే ప్రధానమైన పేరు. కొన్ని దశాబ్దాలుగా ఆ స్టూడిలో కొన్ని వేల సినిమాలు వదలం సీరియళ్లు నిర్మాణం జరుపుకున్నాయ. అయితే 2017లో ఆర్కే స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తి న‌ష్టం అయ్యింది.                       


దీంతో ఆ నష్టం నుండి కోలుకోలేని రాజ్ కపూర్ వారసులు ఆర్కే స్టూడియోని అమ్మేసారు. ఆగ్ అనే సినిమాతో సినీ రంగంలోకి వచ్చిన ప్రతిష్టాత్మక ఆర్కే స్టూడియో'కు సంబంధించి ఇకపై గేటు మాత్రమే మిగులుతుంది. అది కూడా కేవలం ఆర్కే స్టూడియోతో ఎంతో అనుబంధం కలిగి ఉన్న సినీ ప్రేమికుల కోసం ఆ గేట్లు ఉంచుతున్నట్టు రాజ్ కపూర్ కుమారుడు రణధీర్ కపూర్ తెలిపారు.                                                                                                     


71 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్కే స్టూడియో స్థలంలో కొత్తగా కంప్లెక్సని నిర్మించనున్నట్టు, ఆ స్థలంలో ఒక్కప్పుడు ఆర్కే స్టూడియో ఉండేదని రాబోయే తరాలకు తెలియడం కోసం, ఆ స్టూడియోతో అనుబంధం ఉన్నవారి కోసం ఆ గేట్లను తొలిగించకుండా ఉంచుతున్నారట...                                                                                                                                                                          


మరింత సమాచారం తెలుసుకోండి: