‘సాహో’ ను ప్రమోట్ చేస్తూ ప్రభాస్ నిన్న బెంగుళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాస్ కు ఊహించని ప్రశ్నలు ఎదురుయ్యాయి. కృష్ణంరాజు నటించిన ‘భక్తకన్నప్ప’ సినిమాను తీస్తే బాగుండేది కదా అన్నప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభాస్ తప్పకుండా తాను ‘భక్తకన్నప్ప’ మూవీ రీమేక్ లో నటిస్తానని అయితే అలాంటి సినిమాలో నటించడానికి తనకు వయసు రీత్యా మరికొంత సమయం పడుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదేసందర్భంలో ప్రభాస్ కు మరో ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న హీరో సంపూర్ణేష్ బాబు ఈమధ్య నార్త్ కర్నాటక ప్రాంతాన్ని కుదిపేసిన వరదల పరిస్థితి పై స్పందిస్తూ అక్కడ ప్రజల సహాయంకోసం 2లక్షలు విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తూ టాప్ రేంజ్ హీరో స్థాయిలో ఉన్న మీరు ఎందుకు సహాయం చేయలేదు అంటూ ప్రభాస్ ను ఒక మీడియా ప్రతినిధి తన ప్రశ్నతో కార్నర్ చేసాడు. 

ఊహించని ఈప్రశ్నకు షాక్ అయిన ప్రభాస్ వెంటనే తేరుకుని తాను కూడ నార్త్ కర్ణాటక ప్రజల కోసం తనవంతు సహాయం చేస్తాను అనిక్లారిటీ ఇచ్చాడు. ఈమీడియా మీట్ లో ప్రభాస్ కు ఊహించని విధంగా అనుష్కతో తన సాన్నిహిత్యం పై ప్రశ్నలు ఎదురుకావడమే కాకుండా పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రశ్నలతో పాటు ‘వదినను ఎప్పుడు చూపిస్తావు అన్న’ అంటూ ఒక మహిళా జర్నలిస్ట్ అడగడంతో ప్రభాస్ కొద్దిగా ఖంగుతిన్నాడు. 

‘సాహో’ మూవీ గురించి అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ప్రభాస్ ఈమూవీ టైటిల్ కు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. ‘సాహో’ అనేది సంస్కృత పదం అని చెపుతూ ‘జయహో’ అన్నఅర్ధం ‘సాహో’ లో వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఈమూవీ తరువాత తన సినిమాలు అన్నీ ఎక్కువగా లవ్ స్టోరీలే ఉంటాయని చెపుతూ తన పెళ్ళి గురించి తనకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు అంటూ ప్రభాస్ చురకలు వేశాడు..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: