మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమకో అవకాశం వస్తే చాలనుకునే నటులు, టెక్నీషియన్లు చాలామందే ఉంటారు. చిరంజీవితో ఆయన కుటుంబంలోని నటులే తెరమీద కనిపిస్తే అభిమానులకు కిక్కే కిక్కు. అదే.. రామ్ చరణ్-చిరంజీవి కలిసి నటిస్తే అభిమానులకు పూనకాలే. ఖైదీ నెం.150 లో ఓ పాటలో వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే అభిమానులు సంబరపడిపోయారు. అలాంటి అవకాశమే సైరా.. లోనూ వచ్చి చేజారిందంటోంది చిత్ర యూనిట్.

 


సైరా.. కథలో షేర్ ఖాన్ అనే పాత్ర ఉందట. ఈ పాత్రని రామ్ చరణ్ తో చేయించాలని భావించాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. దీనికి చిరంజీవి కూడా ఓకే అన్నారట. కానీ.. తర్వాత ఎందుకో స్క్రిప్టు దశలోనే ఆ ఆలోచనను విరమించుకున్నారట. లేదంటే.. మరోసారి వీరిద్దరూ అభిమానులను అలరించేవారే. చిరంజీవితో ఆయన కుటుంబంలోని నటులు కలిసి నటించడం కొత్తేమీ కాదు. చిరంజీవి-నాగబాబు కలిసి చాలా సినిమాల్లో నటించారు. విచిత్రమేమిటంటే.. ఖైదీ నెం.150లో తప్ప వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమాలో నాగబాబు క్యారెక్టర్ చనిపోతుంది. అల్లు అరవింద్-చిరంజీవి కలిసి ఛాలెంజ్, చంటబ్బాయి సినిమాల్లో నటించారు. చిరంజీవి-పవన్ కలిసి శంకర్ దాదా జిందాబాద్ లో నటించారు. డాడీ సినిమాలో ఓ ఫైట్ పవన్ డిజైన్ చేశారు. సైరా.. టీజర్ కు పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నాగబాబు కూతురు నిహారిక సైరాలో నటించింది. డాడీ సినిమాలో చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ ఓ డ్యాన్స్ బిట్ చేశాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిన్న పిల్లాడి క్యారెక్టర్ లో వైష్ణవ్ తేజ్ నటించాడు.

 


చిరంజీవి కుటుంబసభ్యులే నటులుగా చూస్తే ఓ క్రికెట్ టీమ్ లా ఉంటుందని ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకులు కూడా భావిస్తారు. అభిమానులకు ఈ విషయం గర్వంగా ఉంటుంది. తమ వెండితెర ఇలవేల్పు.. మెగాస్టార్ తో ఆయన కుటుంబంలోని నటులు కలిసి నటిస్తే చూడటానికి సంబరమే కదా!


మరింత సమాచారం తెలుసుకోండి: