మాస్ మహా రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం  'డిస్కోరాజా'.   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  ఢిల్లీలో జరుగుతుంది.  ఈ షెడ్యూల్ లో  కొన్ని కీలక సన్నివేశాలను   చిత్రీకరిస్తున్నారు.   ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ నుండి రవి తేజ కొత్త లుక్  బయటికి వచ్చింది. ఇక  ఈ లుక్  నెటిజన్లకు షాక్ ఇచ్చింది.  ఆ లుక్ లో  చాలా  యంగ్ గా కనిపిస్తున్నాడు మాస్ రాజా. అసలు  నిజంగానే  రవి తేజానా.. కాదా  అని పోల్చులేకపోతున్నామని కామెంట్లు పెడుతున్నారు. కాగా  ఈ చిత్రం లో  రవి తేజ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. అందులో భాగంగా   ఒక రోల్ లో ఆయన  యువకుడిగా నటిస్తున్నారు.  ఇక ఈ ఢిల్లీ షెడ్యూల్ తరువాత  చిత్ర బృందం స్విజ్జర్లాండ్ కు వెళ్లనుంది. అక్కడ జరిగే  షెడ్యూల్ తో షూటింగ్ దాదాపుగా  పూర్తి కానుంది.  సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో  నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్   కథానాయికలుగా నటిస్తున్నారు. 




 ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో  బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు  తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన రవితేజ ఈ సినిమాఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు.  మరి ఈ చిత్రంతో నైనా హిట్ కొట్టి  రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: