సినిమా ఇండస్ట్రీలో కథలు దొరకడం లేదు.. ఉన్న కథల్నే అటు మార్చి, ఇటు మార్చి సినిమాలుగా తీస్తున్నారు.  పాత సీసాలో కొత్త నీళ్లు పోసి సినిమాలు చేస్తున్నారు.  ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది గ్యారెంటీ లేదు.  సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  కానీ, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు.  పాత సినిమాలను తీసుకొని మార్చి మార్చి తీస్తే చూడటం లేదు.  


అందుకే ఇప్పుడు హీరోల చూపులు పక్క రాష్ట్రాల్లోని సినిమాలపై పడుతున్నాయి.  అక్కడి నుంచి సినిమాలను తీసుకొని, రీమేక్ చేస్తున్నారు.  ఇక్కడ హిట్స్ కొడుతున్నారు.  అలా వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. అవుతూనే ఉన్నాయి.  చాలా కాలంగా హిట్ కోసం తపించిపోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టాడు.  ఇది తమిళంలో హిట్టైన సినిమాకు రీమేక్.  తెలుగులో కూడా మంచి హిట్ కావడంతో తిరిగి లైన్లోకి వచ్చాడు.  స్ట్రెయిట్ సినిమాలు నమ్ముకోవడం కంటే.. ఇలా రీమేక్ చేసుకోవడమే బెటర్ అనుకున్నాడేమో.. 


అంతేకాదు, తమిళంలో హిట్టైన 96 సినిమాను తెలుగులో దిల్ రాజు అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.  శర్వానంద్ హీరో.  సమంత హీరోయిన్.  ఇప్పటికే సినిమా చాలా వరకు పూర్తయింది.  తెలుగు రీమేక్ బాధ్యతలను మిగతా ఎవరికైనా అప్పగిస్తే ఏమౌతుందో అని భావించి రీమేక్ భాద్యతలను ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ కు అప్పగించాడు.  తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  


దీంతో పాటు, తడం అనే సినిమాను రామ్ రీమేక్ చేస్తున్నాడు.  తమిళంలో తడం బాంబర్ హిట్.  ఈ మూవీ ఎన్నో రికార్డులు సాధించింది.  అరుణ్ విజయ్ హీరోగా చేసిన ఈ సినిమా థ్రిల్లింగ్ హిట్ కొట్టింది.  ఈ సినిమాను చూసిన రామ్.. రీమేక్ హక్కులు తీసుకున్నారు.  తెలుగులో దీన్ని రీమేక్ చేసే బాధ్యతను తిరుమల కిషోర్ కు అప్పగించారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి.  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మంచి హిట్ కొట్టాడు.  రామ్ లో ఉన్న ఎనర్జీని సూపర్ గా యూజ్ చేసుకున్నాడు పూరి.  ఈ సినిమాలే కాదు.. చాలా మంది హీరోల చూపులు ఇప్పుడు ఇతర సినిమా ఇండస్ట్రీలో హిట్టైన సినిమాలవైపు చూస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: