మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఖైది నంబర్ 150తో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిరు ఈ సినిమాతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. సైరా సినిమా భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కింది. చరిత్ర మర్చిపోయిన ఓ స్వాతంత్ర సమరయోధుడి జీవిత కథతో ఈ సినిమా చేశారు.          


తండ్రి కలగన్న ఈ సినిమాను తనయుడు రాం చరణ్ నిర్మాతగా మారి చేశాడు. అయితే ఈ సినిమా తీసేందుకు బాహుబలి చలువే అంటున్నారు. 300 కోట్ల బడ్జెట్ ఎలా ధైర్యం చేశారని అందరు అడుగుతున్నారు. బాహుబలి సినిమా వల్లే సైరా సినిమా చేశామని.. బడ్జెట్ గురించి పెద్దగా ఆందోళన లేదు ఇతర మార్గాల ద్వారా అది వచ్చేస్తుంది. సైరా సినిమా తీసేందుకు బాహుబలి మార్గం చూపిందని అన్నారు చిరంజీవి.       


అయితే ఈ కథనే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు సమాధానంగా తన మనసులో చాలా ఏళ్లుగా ఉన్న కథ ఇది.. దేశభక్తి కథ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యే అంశాలు ఉన్నాయి. అందుకే సైరా ను తీశామని అన్నారు చిరంజీవి.  


తను తీసిందే గొప్ప సినిమా అనే బిల్డప్ ఇవ్వకుండా బాహుబలి వల్లే తాము కూడా ఈ సాహసం చేశామని చెప్పడం మంచి విషయం. నిజంగానే తెలుగు సినిమా 50 నుండి 100 కోట్లు కలెక్ట్ చేయడమే గగనమే అనే పరిస్థితి నుండి 300 కోట్ల బడ్జెట్ రేంజ్ కు వెళ్లిందంటే అదంతా బాహుబలి వల్లే. అయితే అన్ని సినిమాలు ఇలా చేసే అవకాశం ఉండదు. సైరా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: