బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ మధ్య రోజులు గొడవలు కామన్ అయ్యాయి. రీసెంట్ గా హౌజ్ లో మహేష్, ఆలి గొడవ మరవక ముందే ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూం లోకి పిలిపించి వారి గురించి ఇతర ఇంటి సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో చూపించి వారి మధ్య మళ్లీ గొడవలు సృష్టించేలా చేశాడు బిగ్ బాస్.    


ఇక ఇదిలాఉంటే హిమజకు మాత్రం ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల అందరి చేత హిమజ నెగటివ్ ఇంప్రెషన్ కలిగించుకునేలా చేయాలి. అయితే బాబా భాస్కర్ ఆమ్లేట్ విషయంపై హిమజ నానా రచ్చ చేసింది. నేను తినకపోతే ఇంకెవరు ఆంలేట్ తినొద్దని కిచెన్ లో ఉన్న ఎగ్స్ అన్ని ఎత్తేసింది.


ఫైనల్ గా తన సీక్రెట్ టాస్క్ లో భాగంగా లక్సరీ బడ్జెట్ ను కేటాయించిన టైంలో చేయకుండా ఇంటి సభ్యులను డిస్ట్రబ్ చేయాలి కాని హిమజ ఎంత ప్రయత్నించినా రవి, అలి అడ్డుపడి ఆమె వల్ల లక్సరీ బడ్జెట్ టాస్క్ ఆగకుండా చేశారు. దీనితో హిమజ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఓడిపోయినట్టు వెళ్లడించాడు బిగ్ బాస్.      


ఇక ఈ వారం నామినేషన్ లో బాబా భాస్కర్, అషు రెడ్డి, రాహుల్, పునర్నవి, మహేష్, హిమజలు ఉన్నారు. అందరు అషు లేదా పునర్నవిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు హౌజ్ మెట్స్ చేసే హంగామా చూశారు. శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి సందడి చేస్తాడు. ఆట పాటలతో తన చలకీతనంతో వారం మొత్తం ఎనలైజ్ చేస్తూ ఇంటి సభ్యులకు కావాల్సిన బూస్టప్ తో పాటుగా ఎవరైనా తప్పు చేస్తే వారికి క్లాస్ పీకడం నాగార్జున చేస్తుంటాడు.    



మరింత సమాచారం తెలుసుకోండి: