ఇందిరా గాంధి మొదటి మహిళ ప్రధాని.భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన వ్యక్తి ఇందిరా గాంధీ.1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్దంలో కీలక పాత్ర పొషించారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి ఉక్కు మనిషిగా కీర్తించబడ్డ నాయకురాలు.ఇలాంటి నాయకురాలి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.అందువల్ల ఆమె జీవిత చరిత్ర మీద వచ్చిన పుస్తకాలపై  ఆసక్తిని కనబర్చుతూనే ఉంటారు.బాలీవుడ్  హీరోయిన్ విద్యాబాలన్ కూడా ఇందిరా గాంధి బయోపిక్ ను చేసేందుకు ఆసక్తిగా ఉంది.
విద్యాబాలన్  రెండు సంవత్సరాలు సినిమాల నుండి విరామం తీసుకుంది. ఆగస్టు15న  వచ్చిన మిషన్ మంగాల్ తో  మళ్ళీ  సినిమాల్లో కి వచ్చారు.ఈ సినిమా దాదాపు 125 కోట్లు వసూల్లూ సాధించింది.మిషన్ మంగాల్ ధియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శంపబడుతుంది.విద్యాబాలన్ చాలా రోజులుగా  ఒక వెబ్ సిరీస్ పై స్ర్కీప్ట్ పనిచేస్తున్నారు. ఆ స్ర్కీప్ట్ తనకు ఎంతో ఇష్టమైనా రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధి జీవిత చరిత్ర.రెండేళ్ల క్రితం ఇందిరా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం హక్కులు కొనుగోలు చేశారు. 
వెబ్ సిరీస్  స్ర్కీప్ట్  రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇందిరా గాంధీ స్ర్కీప్ట్  ఇంకా ఎక్కువగా సమయం తీసుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చేది క్లీయర్ గా చెప్పలేం అయితే వచ్చే రెండేళ్లలో వెబ్ సిరీస్ ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. "లాంచ్ బాక్స్" సినిమాను దర్శకత్వం వహించిన రితేష్ బాత్రా ఈ వెబ్ సిరీస్ కూడా దర్శకత్వం వహిస్తాడు. ఇందిరా గాంధీ సంబంధించిన చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఏలాంటి తోందర లేకుండా  బాగా ఆలోచించి  వెబ్ సిరీస్ లో ఎలాంటి అంశాలు చూపించాలని ప్లాన్ చేస్తున్నాం అని ఆవిడ చెప్పింది.ఈ వెబ్ సిరీస్ లో ఇందిరమ్మ పాత్రను విద్యాబాలన్ చేసే అవకాశం ఉంది.ఈ వెబ్ సిరీస్ ని విద్యాబాలన్  నిర్మిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: