శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హిమజకి ఇంట్లో విలన్ అవ్వాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అయితే ఆమె దాన్ని కొంత వరకు సరిగ్గానే నిర్వర్తించినా, మొత్తంగా చూసుకుంటే ఆ టాస్క్ లో ఆమె ఫెయిలైంది. అయితే శుక్రవారం హిమజ చేసిన రచ్చ గురించి, గురువారం ప్రోమోలో చూపించారు. అయితే ఆ ప్రోమో హిమజ కొంపముంచిందని భావిస్తున్నారు. ప్రోమో వచ్చినపుడు అది సీక్రెట్ టాస్క్ అని ఎవరికీ  తెలియదు.


దాంతో హిమజ అలా ఎందుకు చేస్తుందంటూ అందరూ షాక్  అయ్యారు. ఎప్పుడూ కూల్ గా ఉండే హిమజ ఇలా ప్రవర్తించడం ఏంటని చర్చించారు. కానీ ఆమె అలా చేయడం వెనక మర్మం మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. శుక్రవారం ఎపిసోడ్ చూసేవరకు అది సీక్రెట్ టాస్క్ అని, అందువల్లే హిమజ అలా చేసిందని అర్థమైంది. కానీ ఆ ప్రోమో చూశాక ప్రేక్షకుల్లో హిమజ ప్రవర్తనపై ఒక రకమైన నెగెటివ్  భావం పెరిగిందని అంటున్నారు.


దాని వల్ల ఆమెకు ఆరోజు  ఓట్లు తగ్గాయని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ విధంగా ఓటింగ్ లో ఏదైనా తేడా జరిగిందేమోనని,దాని వల్ల ఆమె డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే నామినేషన్ లో హిమజ కి అది కోలుకోలేని దెబ్బే అవుతుంది. మొదటి నుండి ఇప్పటి వరకు హిమజ ఎప్పుడూ ఎవరితో గొడవ పెట్టుకోకుండా, అందరితో కలివిడిగా ఉంటూ వస్తుంది.


ఎవ్వరితో కావాలని గొడవకి పూనుకున్న దాఖలాలు లేవు. అటువంటి హిమజ ని అలా చూపించేసరికి హిమజ మారిపోయిందని అనుకున్నారు.శుక్రవారం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియలేదు అది సీక్రెట్ టాస్క్ అని. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది కాబట్టి ఇక చేసేదేమీ లేక ఊరుకున్నారు. ప్రోమో ద్వారా ఆమె కోల్పోయిన ఓట్లను తిరిగి తెచ్చుకుందా లేదా అనేది అనుమానమే! మరి ఈ విధంగా చూసుకుంటే ప్రోమో ఆమెకి చాలా నష్టాన్నే తెచ్చిపెట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: