బాలీవుడ్ క్రేజీ కపుల్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా డేటింగ్ న్యూస్ గురించి అందరి తెలిసిందే. వీరిద్దరు చెట్టాపటాలేసుకు తిరగడం కామనే. ఇన్నాళ్లు సీక్రెట్ గా జరిగిన వీరి వ్యవహారం కరణ్ జోహార్ షోలో రివీల్ చేశాడు అర్జున్ కపూర్. ఇక మలైకా కూడా అర్జున్ కపూర్ గురించి అతని ఫోటో షేర్ చేసి ఇతడు నావాడు అంటూ ట్వీట్ చేసింది.


పెళ్లి మాట మాత్రం ఎత్తని ఈ ఇద్దరు ఎక్కడపడితే అక్కడ జంటగా కనిపిస్తున్నారు. మలైకా కన్నా అర్జున్ కపూర్ 11 ఏళ్లు చిన్నవాడు. అందుకే వీరి డేటింగ్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అర్జున్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన ప్రతిసారి మలైకాని విమర్శిస్తుంటారు. అయితే విమర్శలకు స్పందించే మలైకా ఇతరుల చేసే ప్రతి పనిని పరిశీలించడం కొంతమంది పని.. విమర్శించడం కామన్. ప్రతి సెలబ్రిటీకి ఈ పరిస్థితి వస్తుంది. ఈ విమర్శలను ఆపడం సాధ్యం కాదు. అవన్ని వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలని అంటుంది మలైకా.  


మలైకా చెప్పింది చూస్తే ఎవరేం అనుకున్నా సరే తనకు నచ్చినట్టుగా తను చేస్తే ఆన్నట్టుంది. అర్జున్, మలైకా ఇలా జంటగా తిరగడమేనా లేక పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకు మలైకా సమాధానం దాట వేస్తుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్ తో పాటుగా పలు టివి షోలతో ఫేమస్ అయిన మలైకా అరోరా తెలుగులో కూడా అడపాదడపా కనిపించి అలరించింది.   


అర్జున్, మలైకాల రిలేషన్ ఎందాకా వెళ్తుంది.. వీరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా.. బాలీవుడ్ హాట్ కపుల్స్ తీసుకునే నెక్స్ట్ డెశిషన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. అర్జున్ కపూర్ సినిమాలను కూడా పక్కన పెట్టి మలైకాతో ఎంజాయ్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: