తెలుగు బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగిపోతుంది. మొదలైన నాలుగు వారాలలో నలుగురు షో కి బై చెప్పివెళ్లిపోయారు. నాలుగు వారాల్లో వ‌రుస‌గా హేమ‌, జాఫ‌ర్‌, త‌మ‌న్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్ కి గాను ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. మరి ఈ ఏడుగురిలో ప్రేక్షకులు ఎవరిని ఇంటి దారి పట్టించనున్నారో ఇంకొద్ది గంటల్లో తెలియనుంది. 


తాజాగా బిగ్ బాస్ షో వైల్డ్ కార్డు ఎంట్రీ పై ఓ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రవేశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి రెండో వారంలో ప్ర‌వేశించింది. ఆమె హౌస్‌లో ఉన్న రెండు వారాలు నానా ర‌చ్చ చేసింది. 


త‌మ‌న్నా సింహాద్రి చేసిన ర‌చ్చ‌తో షోకు కావాల్సినంత మ‌సాలా వ‌చ్చిన‌ట్ల‌య్యింది. చివ‌ర‌కు ఆమె హౌస్‌లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో చాలా మందికి వ్య‌తిరేకంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు బ‌య‌ట సోష‌ల్ మీడియాలోనూ క్యాంపెయిన్ లేక‌పోవ‌డంతో వ్య‌తిరేకులు త‌య‌రయ్యారు. దీంతో రెండు వారాల‌కే ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఆమె విపరీత ప్రవర్తన కారణంగా షో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌న్న‌ది నిజం.


మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక తెలుగు హీరోయిన్ షోలో ప్రవేశించనున్నారట. తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా బిగ్ బాస్ షో లోకి ప్రవేశించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈషా రెబ్బ ప‌లు సినిమాల్లో మ‌న‌కు ప‌రిచ‌య‌మే. మరి ఇదే కనుక జరిగితే షో కి మరింత గ్లామర్ యాడ్ అయినట్లే లెక్క. మ‌రి ఈషా రెబ్బా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందో ?  లేదో ? ఈ శ‌ని, ఆదివారాల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: