క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఈ రౌడీ హీరోకి షాక్ ఇచ్చాడట. విజయ్ ప్లాన్ కు .. నో చెప్పాడట. అసలు విజయ్ దేవరకొండ వేసిన ఆ ప్లానేంటో ఓ సారి చూద్దాం.. 


న్యూ ఏజ్ సినిమాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో షార్ట్ టైమ్ లో విజయ్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఎంతటి హీరోకైనా ఫ్లాప్ తప్పదన్నట్టు కామ్రేడ్ సినిమాతో విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బనే తగిలింది. డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు ద్విభాషా చిత్రం హీరో సినిమా ఆగిపోయింది. ప్రజెంట్ ఈ రౌడీ క్రాంతి మాధవ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పెళ్లి చూపులకు ముందు కమిట్ అయిన సినిమా అని తెలుస్తోంది. దీంతో ఇపుడున్న తన ఇమేజ్ కు వర్కవుట్ అవుతుందో లేదో అనే డౌట్ తో విజయ్ ఓ ప్లాన్ వేశాడట. అందుకు చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు నో చెప్పాడట.


విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని విజయ్ ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి పూరీ సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాడట. కానీ ఇందుకు నిర్మాత కె.ఎస్.రామారావు ఒప్పుకోలేదట. దీంతో వేరే ఆప్షన్ లేకపోవడంతో రౌడీ హీరో సైలెంట్ అయ్యాడట. ఇంకేముందీ విజయ్ దేవరకొండ తన షూటింగ్ లో బిజీ అయిపోయాడు. 





మరింత సమాచారం తెలుసుకోండి: