భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ను సరైన సమయంలో గుర్తించి దానిని దారిలో పెట్టినపుడు.. వారు అభివృద్ధి చెందుతుంటారు.  డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తరువాత... ప్రతి ఒక్కరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  అలా వెతుక్కుంటూ వస్తున్న అవకాశాల్లో ఒకటి ఇటీవలే జరిగింది.  


బెంగాల్లోని ఓ రైల్వే స్టేషన్ లో ఓ పేద మహిళా రైల్లో పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది.  అయితే, ఆమె స్టేషన్లో కూర్చొని లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హై అనే పాట ఆకట్టుకుంది.  అచ్చంగా లతా మంగేష్కర్ పాడినట్టుగా ఉండటంతో.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.  సోషల్ మీడియాలో ఆమె గొంతు వైరల్ అయ్యింది.  అలా వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.  


బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమ్మియా ఆమెకు అవకాశం ఇచ్చాడు.  ఎక్కడో ఉన్న ఆమెను పిలిపించి తన సినిమాలో పాడే అవకాశం కల్పించారు.  సాంగ్ సూపర్ గా వచ్చింది.  వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో.. హిమేష్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.  అంతేకాదు.. ఆమె పడిన పాట తాలూకు చిన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు.  ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.  


హిమేష్ పాటలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  అయన మ్యూజిక్ అందించిన పాటలు పాడటం అంటే అంత సులువైన పనికాదు.  కానీ, ఆమె ఆ పాటను ఎంత అద్భుతంగా పడింది అంటే చెప్పక్కర్లేదు.  భయం లేకుండా ధైర్యంగా పాట పాడింది.  సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా బాలీవుడ్ లో ఛాన్స్ లు కొట్టేస్తోంది.  ఈ ఒక్కపాటే కాకుండా ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట.  త్వరలోనే రెహ్మాన్ సినిమాలో కూడా పాట పడబోతున్నట్టు తెలుస్తోంది.  అరచేయి అడ్డుపెట్టి సూర్యుడి వెలుగును ఆపలేము అన్నట్టుగా టాలెంట్ ను కూడా అంతే.  


మరింత సమాచారం తెలుసుకోండి: