యంగ్ హీరో అడవి శేష్ సినిమా.. సినిమాకు సర్ ప్రైజ్ చేస్తున్నాడు. సైలెంట్ గా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నాడు. రొటీన్ మూవీస్ తో విసుగెత్తిపోతున్న టూలీవుడ్ కు సరికొత్త దారులు చూపిస్తున్నాడు. టాలీవుడ్ హీరోలంతా ఓ దారిలో వెళ్తుంటే అడవి శేష్ మ్తారం సపరేట్ ట్రాక్ లో వెళుతున్నాడు. వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ విలక్షణతను చాటుకుంటున్నాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన దారిలో వెళుతూ వరుస సక్సెస్ లు పట్టేస్తున్నాడు. ఇదే ఇపుడు అడవి శేష్ ను టాలీవుడ్ హీరోల్లో స్పెషల్ గా నిలబెట్టుతోంది. 


క్షణం సినిమాతో సర్ ప్రైజింగ్ సక్సెస్ ను కొట్టిన అడవి శేష్.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో సైతం పర్ఫామెన్స్ తో ఫ్లాట్ చేశాడు. ఇక గతేడాది గూడాచారి సినిమాతో టాలీవుడ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. గూడాచారి థీమ్ కు ఫ్లాట్ అయిన నాగార్జున లాంటి స్టార్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశంసలు కురిపించాడు. 


లేటెస్ట్ గా అడవిశేష్ ఎవరు సినిమాతో మరోసారి టాలీవుడ్ ని ఆశ్చర్యంలో ముంచేశాడు. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది. ఊహించని మలుపుతో సాగే ఎవరు సినిమా థీమ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎవరు సనిమా చూసిన టాలీవుడ్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అడవి శేష్ తన టూరే సెపరేటు అని నిరూపిస్తున్నాడు. మిగతా హీరోలకు భిన్నంగా తన పంథాను కొనసాగిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మరి ఆ రూట్ లో తను ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. సరైన కథతో పాటు సెంటిమెంట్ ను పండించే సీన్ లు అడవి శేష్  బాగా వర్కవుట్ అవుతాయని సినిమా పండితులు విశ్లేషించుకుంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: