రామ్ గోపాల్ వర్మ ఏమిచేసినా ఒక సంచలనమే. దేవుళ్ళ పై సెటైర్లు వేసే వర్మ అతిలోక సుందరి ప్రస్తుతం వర్మ దృష్టిలో స్వర్గంలో ఉన్న శ్రీదేవి కోసం కృష్ణుడుగా మారాడు. ఈ రోజు కృష్ణాష్టమి కావడంతో వర్మ తనకు తానుగా కృష్ణుడుగా ఊహించుకుని శ్రీదేవిని రాథగా భావిస్తూ ఒక గ్రాఫిక్ పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో తన ట్విటర్ ద్వారా షేర్ చేసాడు. 

వర్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. శ్రీదేశి మరణం పట్ల వర్మ భావోద్వేగానికి గురై దేవుడుని నిందిస్తూ అప్పట్లో కామెంట్స్ కూడ చేసాడు. ఈ గ్రాఫిక్ పోస్టర్ కు సంబంధించిన వీడియోలో బ్యాంక్‌ గ్రౌండ్‌ లో శ్రీదేవి వర్మ వాయిస్‌ లు వచ్చాయి. 

ఒకరి పై ఒకరు పంచ్‌ లు వేసుకుంటూ కొనసాగిన ఈ వీడియో చివర్న వర్మ మాటలకు పొంగిపోయిన శ్రీదేవి వర్మతో ‘ఐ లైక్ యు’ అంటుంది. దీనికి వర్మ పొంగిపోయి ఆమెకు కృతజ్ఞతలు కూడ తెలియ చేసాడు. గతంలో ఒకసారి వర్మ శ్రీదేవి జీవించి ఉన్న రోజులలో ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు గృహిణిగా మేకప్ లేకుండా వర్మకు శ్రీదేవి కాపీ ఇచ్చినప్పుడు వర్మకు కోపం వచ్చి అందాల రాశి శ్రీదేవిని గృహిణిగా మార్చినందుకు వర్మకు బోనీ కపూర్ పై తనకు విపరీతమైన కోపం వచ్చింది అని అప్పట్లో చెప్పిన విషయం సంచలనం. 

ప్రస్తుతం వర్మ కృష్ణుడుగా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ అంటూ షాకింగ్ సింబల్స్‌ని పెడుతూ సందడి చేస్తున్నారు. వర్మ ఈ రోజు శ్రీదేవిని తన కలలలో రాథగా ఆరాధించడం చూస్తుంటే వర్మ శ్రీదేవికి ఎంత భక్తుడో అర్ధం అవుతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: