Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 1:51 am IST

Menu &Sections

Search

నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌

నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది- భీమ‌నేని శ్రీ‌నివాస్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో... 


దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ - '''కౌసల్య కృష్ణమూర్తి' సినిమాకు రిలీజైన అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఏదైనా సినిమాకు ఫౌండేషన్‌ కథ. అలాంటి ఒక మంచి కథను సెలెక్ట్‌ చేసుకోవడంలోనే మేము సగం విజయం సాధించాం. అలాగే క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన ఎన్నో మంచి సినిమాలకు ధీటుగా ఉండేలా ఈ సినిమా ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో మంచి సినిమాలే వస్తాయి అని మరోసారి ఈ సినిమా ప్రూవ్‌ చేసింది. సినిమా రిలీజయ్యాక నా మిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్‌ చేసి ప్రశంసించారు. 'సుడిగాడు' తరువాత ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు వారికి అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా సినిమా గురించి తెలుసుకొని థియేటర్‌కి వస్తున్నారు. మంచి సినిమాలకు ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారని మళ్ళీ ప్రూవ్‌ అయింది. ఫ‌స్ట్ టైం నిన్నంతా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది.'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాకు 1500  వరకూ పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఈ సినిమాను ఆడియన్స్‌కి రీచ్‌ చేయడానికి బి.ఎ.రాజుగారు తన సొంత సినిమా కన్నా ఎక్కువ కష్టపడ్డారు. అలాగే డిజిటల్‌ పబ్లిసిటీలో సి జోన్‌ విశ్వ చాలా సపోర్ట్‌ చేశారు. ఇంత మంచి కథ అందించిన అరుణ్‌ రాజా కామరాజ్‌గారికి, తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 'కౌసల్య కృష్ణమూర్తి' నా కెరీర్‌లో ఒక మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిపోతుంది'' అన్నారు. 


క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' ఆగష్టు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మా చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్‌లోనూ ఇటు ప్రేక్షకులతో పాటు సమీక్షకుల ప్రశంసలు లభించాయి. దానికి కారణమైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, కార్తీక్‌రాజులను అభినందిస్తున్నాను. సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా ఇంకా మంచి సక్సెస్‌ సాధించడం ఎంతో అవసరం. చిన్న బడ్జెట్‌ సినిమాలకు, సమాజానికి ఉపయోగపడే ఒక పర్పస్‌ఫుల్‌ మూవీస్‌కి మీ అందరి ప్రోత్సాహం కావాలి. అప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడానికి స్కోప్‌ ఉంటుంది. సినిమా చూసినవారు ఒకప్పుడు 'శంకరాభరణం', 'మాతృదేవోభవ' లాంటి మరో గొప్ప సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి' అంటున్నారు. మీ అందరి సద్విమర్శలు మా సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ మధ్యకాలంలో అన్ని వెబ్‌ సైట్స్‌ ఇంత గొప్పగా రాసిన సినిమా, అన్ని వెబ్‌ సైట్స్‌లోనూ 3.5 నుండి 4 వరకూ రేటింగ్స్‌ రావడం విశేషం. ఒక మంచి సినిమాను మీడియా ఎంత బాగా ప్రోత్సహిస్తుంది అనడానికి ఈ రివ్యూలు నిదర్శనం. మా టీమ్‌ అందరం గర్వంగా చెప్పుకునే 'కౌసల్య కృష్ణమూర్తి' గొప్ప విజయం సాధించడానికి మీ అందరి సహకారం తప్పకుండా ఉంటుందని నమ్ముతున్నాను. ఇక నుండి క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నుండి కచ్చితమైన, మంచి పర్పస్‌ ఉన్న మూవీస్‌ వస్తాయని, మా రాబోయే సినిమాల్లో కూడా అదే క్వాలిటీ, అదే నిజాయితీని మీరు చూస్తారని నమ్ముతున్నాను. అలాగే క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో భాగం అయిన బి.ఎ.రాజుగారికి, సి జోన్‌ విశ్వకి థాంక్స్‌. '' అన్నారు. 



kaushalya,-bheemaneni
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాస‌రి కోసం చేసేది క‌ర‌క్టేనా...?
రాయలసీమ లవ్ లో ఆశ్లీలత లేదంట‌?
`ఉల్లాలా ఉల్లాలా`అంటున్న నూరిన్‌
విఠల్ వాడి ప్రేమ‌క‌థ‌కు జగపతిబాబు ప్ర‌మోష‌న్‌
అమితాబ్ పారితోషికం తీసుకోలేద‌ట‌!
గోపీచంద్ తో మిల్కీబ్యూటీ జ‌త‌క‌ట్ట‌నున్నారా...?
41 ఏళ్ల ప్ర‌స్థానం
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'.
'రాగల 24 గంటల్లో'‌‌ స‌త్య‌దేవ్‌, ఇషారెబ్బా ఏం చేయ‌బోతున్నారు...?
ఆస్కార్ లిస్టులో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా
రాజ‌మండ్రికి క‌ళ్యాణ్‌రామ్‌తో మెహ‌రీన్ వెళ్లిందా...?
కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ లో స‌స్పెన్స్ ఏంటంటే...?
నాయకుడిగా నే కాదు...నటుడిగా కూడా కేక పుట్టించిన శివ ప్రసాద్..
నిన్ను తలచి కి మాస్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌
`సంహారిణి` అరుంధ‌తికి పోటీనా...?
సినిమా న‌చ్చ‌క‌పోతే తిట్ట‌మంటున్న ద‌ర్శ‌కుడు
`90 ఎం.ఎల్` దేవ‌దాస్ కొత్త‌గా ఏం చేస్తాడో...?
బ‌తుక‌మ్మ చీర‌ల‌కు భ‌రోసేనా...?
జగన్.. ఈ పరాచక శాఖ ను ప్రక్షాళన చేయ వలసిందే..!?
పెద‌నాన్న‌కి అబ్బాయికి త‌ప్ప‌ని ఇబ్బందులు
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED