హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ హౌస్ లో మార్వెల్ సంస్థ ఒకటి.  ఈ సంస్థ సూపర్ హీరోస్ పాత్రలను సృష్టించి సినిమాలు తీస్తుంటుంది.  ఇందులో భాగంగానే ఇటీవల తీసిన ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమా ప్రపంచంలోని అత్యాకధిక వసూళ్లు సాధించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. దాదాపు 2.83 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.  సినిమాపై నమ్మకం ఏర్పడింది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి మరో సినిమా రాబోతున్నది.  


అది సూపర్ హీరోస్ సినిమానే.  కాకపోతే అందులో సూపర్ హీరో పాత్రలో మహిళా నటించబోతున్నది. మహిళా సినిమాలైనా తప్పకుండా చూస్తారు.  అయితే, ఇప్పుడు ఈ మార్వెల్ సంస్థ ఓ వినూత్నమైన పద్దతికి శ్రీకారం చుట్టింది.  ఇప్పటి వరకు ఫలానా మతానికి చెందిన సినిమా ఫలానా వాళ్లకు చెందిన సినిమా అని తీయలేదు.  సినిమాను సినిమాగా తీసింది.  


కానీ, ఇప్పుడు  మొదటిసారిగా మార్వెల్ సంస్థ.. పాకిస్తాన్ నేపధ్యం కలిగిన అమెరికా అమ్మాయి జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నది.  సెప్టెంబర్ 12 న ఈ పాత్రకు సంబంధించిన విషయాలను ప్రకటించబోతున్నది.  కమలా ఖాన్ అనే అమ్మాయి ఇందులో నటిస్తోంది.  ఓ ముస్లిం సూపర్ హిట్ అని చెప్పి ప్రకటించి సినిమా తీస్తున్నారు.  మొదటిసారి ఇలా ప్రకటించి సినిమా తీస్తుండటం అందరిని షాక్ కు గురి చేస్తున్నది.  


హిందూ, ముస్లిం అని కాకుండా సినిమాలు తీసిన మార్వెల్.. ఓ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తూ.. చేయడం అన్నది సాహసంతో కూడుకున్నదే.  ఇలా తీయడం వలన మార్వెల్ సంస్థ గుడ్ విల్ దెబ్బతింటుందా అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ఓ అమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఇతి వృత్తంగా తీసుకొని సినిమా తీయాలి అనుకున్నప్పుడు దానికి తగినట్టుగా మాములు సినిమా తీసుకుంటే బాగుంటుంది కదా.  అలా కాకుండా సూపర్ హీరోస్ అనే ట్యాగ్ చేర్చి సినిమా తీస్తే దాని వలన వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆ పాత్ర ఏంటి ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: