గోపీచంద్ హీరోగా నటించిన తొలివలపు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది స్నేహ. ప్రియమైన నీకు, వెంకీ, రాధా గోపాళం, సంక్రాంతి, పాండు రంగడు, రాజన్న సినిమాలు స్నేహకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించింది స్నేహ. పెళ్ళైన తరువాత సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటున్న స్నేహ ఈ సంవత్సరం విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. 
 
2012 సంవత్సరంలో స్నేహకు తమిళ నటుడు ప్రసన్నతో వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక బాబు ఉన్నాడు.ఈ బాబుకు విహాన్ అనే పేరు పెట్టారు. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన స్నేహ తాను మరోసారి తల్లి కాబోతున్నానని ప్రకటించింది. స్నేహ గుడ్ న్యూస్ చెప్పటంతో ఆమెకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. 
 
రెండోసారి తల్లి కాబోతూ ఉండటంతో కొద్ది రోజులుగా వరుసగా ఫోన్లు మెసేజ్ లు వస్తున్నాయని స్నేహ ఇంటర్వ్యూలో చెప్పారు. అచ్చముండు అచ్చముండు సినిమా షూటింగ్ సమయంలో ప్రసన్న, స్నేహ ప్రేమలో పడ్డారు. స్నేహ భర్త ప్రసన్న తెలుగులో నాగార్జున 'భాయ్ ' సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. 
 
స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత తమిళంలో కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరించారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు స్నేహ. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. స్నేహ తెలుగులో అగ్ర హీరోలైన బాలకృష్ణ , వెంకటేశ్, నాగార్జున, రవితేజలతో నటించారు. రెండోసారి స్నేహ తల్లి కాబోతూ ఉండటం వలన కొంతకాలంపాటు స్నేహ సినిమాలకు దూరంగా ఉండబోతుందని సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: