మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికావొస్తున్నాయి.  మరోవైపు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నది.  అంతేకాదు.. మెగాస్టార్ పుట్టిన రోజున అయన 152 వ సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా ఎందుకో జరగలేదు.  త్వరలోనే ఆ విషయాన్ని కూడా ప్రకటించాల్సి ఉన్నది.  మెగాస్టార్ కుటుంబం అంతా ఇప్పుడు ఈ సినిమాపైనే దృష్టి సారించింది.  


టీజర్ అందరిని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  సైరా గురించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  అందులోని ఓ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు.  అదేమంటే.. అనుష్క గురించే.  సినిమాలో అందరిని చూపించారుగాని అనుష్క గురించి మాత్రం చూపించలేదు.  అనుష్క సినిమాలో ఉన్నారని అన్నారు.  అయితే, ఆమె ఏ పాత్ర చేస్తోంది.. ఎన్ని సీన్స్ లో కనిపిస్తుంది.  ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాలను మాత్రం చెప్పలేదు. ఎట్టకేలకు ఆ ప్రకటించారు.  


సైరాలో స్వీటీ ఉందని, ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ కీలకంగా ఉంటుందని అంటున్నారు. సైరాలో స్వీటీ అనుష్క ఝాన్సీ లక్ష్మి భాయి పాత్ర చేస్తోంది.  ప్రధమ స్వాతంత్ర సమరం కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణిస్తాడు.  సినిమాకు ముందు ఆమె స్ఫూర్తితోనే సినిమా ప్రారంభం అవుతుంది.  అలానే ఎండింగ్ కూడా ఆమె స్ఫూర్తిగా సాగుతుందని తెలుస్తోంది.  


దీనిని బట్టి స్వీటీ సినిమా ఓపెనింగ్, చివరి సీన్స్ లో కనిపించే అవకాశం ఉన్నది.  ఇప్పటికే సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నది.  ఇప్పుడు అనుష్క కూడా ఉన్నది అని స్పష్టమైంది కాబట్టి సినిమాకు మరింత ఫెచింగ్ అవుతుంది.  సినిమాపై నమ్మకం ఏర్పడుతుంది.  మరి సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.  అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది.  ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతోంది అన్నదే చూసుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: