టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  మొదటి సినిమా ఫుల్ మాస్ లుక్ తో అదరగొట్టాడు.  ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి ఒక్క విజయం కూడా వరించలేదు. కెరీర్ కష్టాల్లో పడబోతుందన్న సమయంలో దర్శకధీరుడు రాజమౌళి ‘చత్రపతి’లాంటి బ్లాక్ బస్టర్ అందించారు.  ఈ మూవీ తర్వాత ప్రభాస్ మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. 


అయితే అప్పటి వరకు ప్రభాస్ స్టార్ హీరోగా అందరికీ తెలిసిందే..ఆ హీరోగా బడ్జెట్ కూడా వంద కోట్ల లోపు మాత్రమే ఉండేది.  కానీ రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి, బాహుబలి 2’ సినిమాలతో బడ్జెట్ స్థాయి అమాంతం పెంచారు. దాదాపు రూ.250 కోట్లతో సినిమా తీయడం..ఆ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ చేయడంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

ప్రస్తుతం ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమా కూడా దాదాపు రూ.350 కోట్ల వ్యయంతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, శ్రద్ద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..బాహుబలి తరహాలో సాహో చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను. కానీ బాహుబలి అభిమానులందరినీ ఈ మూవీ అలరించే విధంగా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు.

అంతే కాదు సాహో కనుక హిందీలో ఇతర భాషల్లో వర్కౌట్ అయితే పాన్ ఇండియన్ సినిమాలు కొనసాగిస్తా అన్నారు. ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే నటించడం కష్టమన్నట్లుగా మాట్లాడారు.  అభిమానుల కోరిక మేరకు ఇకపై ఏటా రెండు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రభాస్ వెల్లడించాడు. ఇకపై పాన్ ఇండియన్ సినిమాలు చేసేది చేయనిది సాహో రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని ప్రభాస్ తెలిపాడు. ఈ విషయం వింటే నార్త్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతారని తెగ బాధపడుతున్నారు. ఇకపై అనవసరమైన ఒత్తిడి తీసుకోలేను. భారీ బడ్జెట్ సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తా. ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా అని ప్రభాస్ తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: