భారతదేశమంతా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఎప్పుడూ వివాదాల్లో మునిగితేలుతూ ఉంటాడు. రాజకీయాలలో అతని అభిప్రాయాలను చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. దీనికి సంబంధించి కొన్ని డిబేట్ లలో న్యూస్ ఛానల్ లో కనిపిస్తారు ఆయన. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తన పేరును వార్తల్లో ఉండేటట్లు చూసుకునే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం మరొక వివాదంలో చిక్కుకొని తెర మీద తేలారు.

వివరాల్లోకి వెళితే ప్రకాష్ రాజ్ 'తడ్కా' అనే బాలీవుడ్ చిత్రానికి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మలయాళం సినిమా 'సాల్ట్ అండ్ పెప్పర్' కు రీమేక్. అయితే ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ సంస్థ  జీ గ్రూప్ వారి ఎస్సెల్ విజన్ తో కలిసి సంయుక్తంగా నిర్మించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం బడ్జెట్లో కొంత భాగంగా గా 4.5 కోట్ల రూపాయలను వారికి చెల్లించారు. కానీ ఆయన ఇంకా చాలా మొత్తం ఇవ్వాల్సి ఉందని వారు ఆరోపిస్తున్నారు. డ్యూస్ అంతా కలిపి అది కాస్త 5.88 కోట్ల రూపాయలకు చేరింది.

దీంతో ఎస్ ఎల్ గ్రూప్ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టువారు ప్రకాష్ రాజ్ ను ఆ మిగిలిన మొత్తాన్ని చెల్లించమని ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆదేశించారు. దానికి ప్రకాష్ రాజ్ జులై కి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు కూడా ఆయన డబ్బులు ఇవ్వడం లో విఫలమయ్యాడు.

ఆ భారీ మొత్తం లో భాగంగా ప్రకాష్ రాజ్ రెండు కోట్ల చెక్ ను ఎస్సెల్ వారికి ప్రకాష్ రాజ్ ఇచ్చారట. ఇప్పుడు ఇదే కేసుపై తాజాగా స్పందించిన బాంబే హైకోర్టు జడ్జి శ్రీ రామ్ ప్రకాష్ రాజ్ పై బాంబు పేల్చాడు. ఒకవేళ తాను ఇచ్చిన ఆ రెండు కోట్ల చెక్ కనుక బౌన్స్ అయితే ప్రకాష్ రాజ్ పై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీనిపై తర్వాతి వాదన ఈనెల 30వ తేదీన వింటారు. అయితే ఎస్ ఎల్ వారు ప్రకాష్ రాజ్ కు మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చారట. చూద్దాం ప్రకాష్ రాజ్ ఈ గండం నుండి బయట పడతారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: