బుల్లితెరపై సందడి చేసే యాంకర్లలో సూపర్ క్రేజ్ ఉన్న యాంకర్ రష్మి. ఎప్పుడు జబర్దస్త్ అంటూ బుల్లితెరపై సందడి చేసే రష్మీ అప్పుడప్పుడు వెండితెర‌మీద కూడా మెరుస్తుంటారు. వెండితేర మీద వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తుంది రష్మీ.. ఇలా సినిమాలు, బుల్లితెరపై ప్రోగ్రాములు చేస్తూ సందడి చేస్తుంది రష్మీ. 


ఈ నేపథ్యంలోనే సూప‌ర్ సింగ‌ర్ గీతామాధురి బెట‌ర్ హాఫ్ నందు ప‌క్క‌న రష్మి జోడిగా నటించిన 'శివ‌రంజ‌ని' అనే సినిమా వ‌చ్చింది. కానీ ఆ సినిమా విడుద‌లైనట్టు కూడా చాలా మందికి తెలియ‌దు. స‌రైన ప్రొమిషన్స్ లేకా రిలీజ్ అయినా మరసటి రోజే థియేటర్లో సినిమాని మూసేశారు. అయితే ఈ తరహాలోనే మరో కొత్త సినిమాలో హీరోయిన్ గా రష్మీ ఎంపిక అయ్యిందట. 


ఈ సినిమాలో హీరో పాత్రలో నందుని ఎంపిక చేశారట. షార్ట్ ఫిల్మ్ మేక‌ర్ విరాట్ చెప్పిన క‌థ న‌చ్చి ఇద్ద‌రూ క‌లిసి చేయ‌డానికి అంగీక‌రించార‌ట‌. రియ‌లిస్టిక్ కామెడీ చిత్ర‌మిది. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఇంకో వారం రోజుల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది. స‌ముద్ర‌ తీరాల్లో, అచ్యుతాపురం, జ‌గ‌న్నాథ‌పురంలో ఎక్కువ‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. 


ఇందులో నందు, రష్మి పల్లెటూరు యువతీ యువకులుగా ఈ సినిమాలో కనిపించనున్నారట. డీ గ్లామ‌రైజ్డ్ లుక్స్ తో ఈ సినిమాలో హాట్ లుక్స్ లో రష్మీ కనిపించనుందట. కాగా ఈ సినిమాలో స‌పోర్టింగ్ రోల్స్ లో చాలా మంది కొత్త‌వారు ఉన్నారట. దొరసాని, అంతరిక్షం వంటి సినిమాలకు సంగీతం అందించిన ప్ర‌శాంత్ విహారి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.                                                     


మరింత సమాచారం తెలుసుకోండి: