వాతావరణం మార్పులరీత్యా హైదరాబాద్‌కు అస్వస్థత చేకూరింది. ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్‌ ఆసుపత్రులు చిన్నపాటి దగ్గు, జలుబు, జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. అయితే డెంగ్యూ వ్యాధి కూడా పలు ప్రాంతాల్లో ప్రబలింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై రోగులు గుర్రుగా వున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా వుండగా కథానాయకుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంనాడు కొందరు ఆయన్ను కలవాల్సి వున్నా ఆరోగ్యం సరిలేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ఇక ఇటీవలే ఆయన నటించిన 'మన్మథుడు2' చిత్రం విడుదలైంది. రాహుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత ఆదరణపొందలేకపోయింది. ఈ విషయంలోనూ నాగార్జున నిరాశలో వున్నాడని ఫిలింనగర్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. 


'మన్మథుడు2'  చిత్రంలో ర‌కుల్ ప‌క్క‌న న‌టించ‌డం కోసం ఆయ‌న కాస్త క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేసిన‌ట్లు స‌మాచారం. దాంతో కొంత డైటింగ్ కూడా కొంచం ఎక్కువగానే చేసిన‌ట్లు ఉన్నారు. ఆ మ‌ధ్య ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాగార్జున వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న చేతికి కూడా చిన్న క‌ట్టు ఉంది. కొంత మంది విలేక‌రులు అడ‌గ‌గా ఆయ‌న కొంచం జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కొంత నొప్పి రావ‌డంతో అలా బ్యాండేజ్ క‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. దీన్ని బ‌ట్టి హీరోల‌కైనా, హీరోయిన్ల‌కైనా వాళ్ళ‌కు ఏదీ సుల‌భంగారాదు. వాళ్ళు కూడా ఎంతో క‌ష్ట‌ప‌డాని. తినే ఆహారం నుంచి ప్ర‌తిదీ నియ‌మాలు పాటించాల్సి వ‌స్తుది. దానికితోడు వాతావ‌ర‌ణం లో కూడా చాలా మార్పులు రావ‌డం న‌గ‌రంలో అనేక మంది అస్వ‌స్థ‌త‌త‌కి గురవ్వ‌డం లాంటివి ఎక్కువ‌య్యాయి. చాలా మటుకు సీనియ‌ర్ హీరోలు వ‌య‌సు పై బ‌డిన‌ప్ప‌టికీ వారి  ఏజ్ తెలియ‌కుండా జిమ్‌లు, డైట్‌లు కొంత ఎక్కువ‌గానే ఫాలోఅవుతూ ఉంటారు. అది ఒక‌ర‌కంగా కొంత వ‌ర‌కే మేలు చేస్తుంది. తీరా ఏదైనా చిన్న జ్వ‌రం వ‌చ్చినా కోల్కోడానికి మ‌ళ్ళీ టైం ప‌ట్టే విధంటా నీర‌స‌ప‌డిపోతారు. సో.. ఏదిఏమైనా ఆయన ఆరోగ్యం కుదుటపడి మరో చిత్రంలో నటించాలని ఆకాంక్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: