Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:48 pm IST

Menu &Sections

Search

సాహో కి ఏపీ ఓకే.... తెలంగాణ మాత్రం దెబ్బేసింది

సాహో కి ఏపీ ఓకే.... తెలంగాణ మాత్రం దెబ్బేసింది
సాహో కి ఏపీ ఓకే.... తెలంగాణ మాత్రం దెబ్బేసింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్న చిత్రం. ఈనెల 30వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ ట్రైలర్ మరియు టీజర్ ద్వారా భారీ క్రేజ్ ని సంపాదించింది. ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు టికెట్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సాహో నిర్మాతలు మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి కోరారు.

ముఖ్యంగా సినిమా విడుదలైన మొదటి వారంలో టికెట్ రేటు 200 రూపాయలకు పెంచేందుకు వారు అనుమతి కోరినట్లు తెలిసింది. ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా వారికి అనుమతి ఇచ్చేసింది. కాబట్టి 'ఏ' సెంటర్ లు ఉండే సింగిల్ స్క్రీన్ లు మరియు మల్టీప్లెక్స్లులలో ఇదే రేటుతో టికెట్టు అమ్మనున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ రేటు వాచిపోయేటట్లు కనిపిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఎంత డబ్బులు పెట్టి అయినా సినిమా చూసే అంత ఊపులో ఉన్నారు.

అయితే కలెక్షన్ల పై గంపెడాశలు పెట్టుకున్న నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం నిరాశపరిచేటట్లు గా కనబడుతోంది. ఇంతకుముందు కూడా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ పెంచే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం సాహో కి కూడా మొండిచేయి చూపేట్టు కనిపిస్తోంది. ఒకపక్క ఏపీ ప్రభుత్వం వెంటనే పర్మిషన్ ఇచ్చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఏమి స్పందించలేదు. దాదాపు తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించక పోవచ్చు అని అందరి మాట. ఇంతకు మునుపు కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు ఒక్క విషయంలోనే
కాకుండా ఉదయం బెనిఫిట్ షోలు వేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇలాగే జరిగితే సాహోకి భారీ నష్టం వాటిల్లుతుంది. 

అయితే ఓవర్సీస్ లో మాత్రం ప్రైవేట్ టికెట్లు ఏకంగా 30 డాలర్లకు పైగా రేటు పలుకుతున్నాయట. వీటన్నింటిని బట్టి చూస్తే మొదటి రోజు కలెక్షన్ తో పాటు సాహో సాధించే మొత్తం చాలా భారీగానే ఉండేటట్లుగా ఉంది.


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కినేని బ్రదర్స్ ని కలిపిన RX100 డైరెక్టర్ ...
నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో నేను ఉండలేను అంటూ రాహుల్ ని వాటేసుకున్న పునర్ణవి..!
రావణుడిగా ప్రభాస్..రాముడిగా హృతిక్ రోషన్...! రామాయణం స్క్రిప్ట్ రెడీ..!
చంద్రయాన్-2 బాధను మరిచిపోయేలా గొప్ప ఘనత సాధించిన భారత్..!
దళితుడు అని ఎం.పీ నే ఊర్లోకి రానీయలేదక్కడ...
వరుణ్ తేజ్ 'వాల్మీకి' కి పెద్ద బొక్క పెట్టిన సూర్య 'బందోబస్త్'
పవన్ కళ్యాణ్ కి భారీ షాక్... జనసేన సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ లేచిపోయాయి మరి..!
'బ్రేకప్' కాదు... నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ
ఈసారి నాని, బండ్ల గణేష్ కలిసి....
అతి భారీగా పెరగనున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు..! సౌదీలో అసలేం జరిగింది..?
మెగా అభిమానులకు షాక్... వాయిదా పడిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..!
వైయస్ వివేకా మృతి vs కోడెల మృతి
కోడెల మృతిపై మరికొద్ది గంటల్లో తేలనున్న నిజం.... ఇప్పటికే వణికిపోతున్నారుగా
కేసులు.. సొంత పార్టీలో అవమానం.. కుటుంబ కలహాలు కోడెలను ఉరి తీశాయి..!
అనుమానస్పద రీతిలో మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య... మృతి..!
బోటు ప్రమాదం గురించి ఒక రోజు ముందే హెచ్చరించారు! కానీ....
విద్యార్ధిని స్నానం చేస్తుంటే వీడియో తీసి... బెదిరించి రేప్ చేసిన బిజెపి నేత..!
త్వరలోనే ఇండో-పాక్ యుద్ధం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..!
నల్లమల యురేనియం మైనింగ్ వ్యతిరేకదారులకు షాక్... కేటీఆర్ సంచలన ప్రకటన..!
భారతదేశం నుండి ఆస్కార్ కొట్టబోయే సినిమా ఇదే.. చిరు, రజినీ నుండి అమీర్ వరకు కోరుకుంటున్నారు మరి
ఒసామా బిన్ లాడెన్ కొడుకును పేల్చి పారేసిన అమెరికా..!
అరుపులు, కేకలు, హావభావాలు: అసెంబ్లీ కాదండోయ్ విశ్వవిద్యాలయం 6-10 ఆచార్యులు ఒక్కగానొక్క వికలాంగుని పై?
వైయస్ జగన్ 100 రోజుల పాలన పై పవన్ రిపోర్టు మామూలుగా లేదుగా..!
పాక్ కు దెబ్బ మీద దెబ్బ..! పాకిస్తాన్ పేరుని సమూలంగా నాశనం చేసిన బంగ్లాదేశ్
బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరంటే....
బాలయ్య జనాలను కొట్టడంలో తప్పేమి లేదంటున్న సీనియర్ నటుడు
పాపం..! డీ.కె శివకుమార్ ను 200 కోట్ల కేసులో అరెస్టు చేస్తే బయట పడింది 800 కోట్లు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.