దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్న చిత్రం. ఈనెల 30వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ హిట్ ట్రైలర్ మరియు టీజర్ ద్వారా భారీ క్రేజ్ ని సంపాదించింది. ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు టికెట్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సాహో నిర్మాతలు మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి కోరారు.

ముఖ్యంగా సినిమా విడుదలైన మొదటి వారంలో టికెట్ రేటు 200 రూపాయలకు పెంచేందుకు వారు అనుమతి కోరినట్లు తెలిసింది. ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా వారికి అనుమతి ఇచ్చేసింది. కాబట్టి 'ఏ' సెంటర్ లు ఉండే సింగిల్ స్క్రీన్ లు మరియు మల్టీప్లెక్స్లులలో ఇదే రేటుతో టికెట్టు అమ్మనున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ రేటు వాచిపోయేటట్లు కనిపిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఎంత డబ్బులు పెట్టి అయినా సినిమా చూసే అంత ఊపులో ఉన్నారు.

అయితే కలెక్షన్ల పై గంపెడాశలు పెట్టుకున్న నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం నిరాశపరిచేటట్లు గా కనబడుతోంది. ఇంతకుముందు కూడా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ పెంచే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం సాహో కి కూడా మొండిచేయి చూపేట్టు కనిపిస్తోంది. ఒకపక్క ఏపీ ప్రభుత్వం వెంటనే పర్మిషన్ ఇచ్చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఏమి స్పందించలేదు. దాదాపు తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించక పోవచ్చు అని అందరి మాట. ఇంతకు మునుపు కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు ఒక్క విషయంలోనే
కాకుండా ఉదయం బెనిఫిట్ షోలు వేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇలాగే జరిగితే సాహోకి భారీ నష్టం వాటిల్లుతుంది. 

అయితే ఓవర్సీస్ లో మాత్రం ప్రైవేట్ టికెట్లు ఏకంగా 30 డాలర్లకు పైగా రేటు పలుకుతున్నాయట. వీటన్నింటిని బట్టి చూస్తే మొదటి రోజు కలెక్షన్ తో పాటు సాహో సాధించే మొత్తం చాలా భారీగానే ఉండేటట్లుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: