రవితేజ మరియు జ్యోతికల కాంబినేషన్ లో వచ్చిన షాక్ సినిమాతో తెలుగు చిత్ర సీమకు దర్శకుడిగా పరిచయం అయిన హరీష్ శంకర్ కు తొలి సినిమానే ఫ్లాప్ గా నిలిచి ఆయనకు పెద్ద షాక్ ని ఇచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్స్ తో దర్శకుడిగా తన అద్భుత ప్రతిభను నిరూపించుకున్న హరీష్ శంకర్, ఆ తరువాత ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్యా రూపంలో ఒక ఫ్లాప్, అలానే ఆపై మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహమణ్యం ఫర్ సేల్ తో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే రెండేళ్ల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత, 

ఇప్పటివరకు ఆయన మరొక సినిమా చేయలేదు. రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం వరుణ్ తేజ్, పూజ హెగ్డే కలయికలో వాల్మీకి సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం తమిళ నటుడు బాబీ సింహ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా రాబోతున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా భారీ స్థాయిలో రూపొందుతన్న ఈ సినిమా, వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు వీడియో ప్రోమో సాంగ్, ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే నేడు దర్శకుడు హరీష్ శంకర్ కాసేపు సరదాగా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మంచి కథ కోసమే రెండేళ్ల గ్యాప్ తీసుకున్నానని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు హరీష్. మరి ఒరిజినల్ మాతృక అయిన జిగర్తాండను యధావిధిగా దింపేస్తున్నారా, లేక మార్పులు ఏమైనా చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు, అది మాత్రం సస్పెన్స్, మీరు సినిమాలోనే చూడాలి అంటూ బదులిచ్చారు. తనకు మెగాస్టార్ అంటే ఎంతో ఇష్టమని, ఆ దేవుడు అనుగ్రహిస్తే త్వరలో మెగాస్టార్ ని కలిసి ఆయనకు మంచి కథను వినిపిస్తానని అన్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ తో పనిచేయాలని తనకు ఎప్పటినుండో ఆశగా ఉందని, ఒకవేళ తనకు అవకాశం వస్తే, ఆయనతో పోకిరి లాంటి సినిమా తీస్తానని అన్నారు. యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి ప్రస్తుతం తెరెకెక్కిస్తున్న వాల్మీకి తప్పకుండా మంచి విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: