ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో రోజు రోజుకు ట్విట్ట‌ర్‌పై మంచి బ‌జ్‌ ఏర్ప‌డుతుంది. టాలీవుడ్‌లో ప్ర‌తి ఒక్క‌రు ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అయితే ఈ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మ‌న స్టార్ హీరోల క్రేజ్ మామూలుగా లేదు. మ‌రి ఆ స్టార్ హీరోలు ఎవ‌రు? వాళ్ల‌ను ఎంత మంది ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం..


నిఖిల్ సిద్దార్థ - `హ్యాపీ డేస్` చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన నిఖిల్‌కు ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 1.2మిలియన్ ఫాలోవర్స్ అంటే 12లక్షలు మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.


మంచు మనోజ్ - మంచు మ‌నోజ్ మోహన్ బాబు త‌న‌యుడుగా `దొంగ దొంగది` చిత్రంలో హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌డం అయ్యాడు. ప్ర‌స్తుతం మ‌నోజ్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 1.4మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


సాయి ధరమ్ తేజ్ - మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్ `పిల్లా నువ్వులేని జీవితం` సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. సాయ్ ధ‌ర‌మ్ తేజ్‌కు ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో 17లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాధించుకున్నాడు.


నాగ చైతన్య - అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వుడు, అక్కినేని నాగార్జున త‌న‌యుడుగా `జోష్‌` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్ర‌స్తుతం స‌మంత‌ను పెళ్లాడిన నాగ చైత‌న్య‌కు ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


రామ్ పోతినేని - ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని `దేవదాసు`చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం ఇయన ట్విట్ట‌ర్ అకౌంట్లో 20 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు.


వరుణ్ తేజ్ - నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ `ముకుంద` చిత్రంతో కెరీర్ ప్రారంభించి కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 వంటి చిత్రాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్‌కు ట్విట్ట‌ర్‌లో 2.2మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాధించుకున్నాడు.


అఖిల్ అక్కినేని -  అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని ` అఖిల్‌` చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల ప‌రంగా పెద్ద హీట్లు లేక‌పోయిన ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మాత్రం ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను భారీగా చొర‌గొంటున్నాడు. ఈయ‌న‌కు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.


నితిన్ - `జయం` సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ మొద‌టి సినిమాతోనే మంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 2.7మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


జూనియర్ ఎన్టీఆర్ - చిన్న వ‌య‌స్సులోనే న‌ట‌న ప్రారంభించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 28లక్షల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.


అల్లు అర్జున్ - అల్లు అర‌వింద్ కుమారుడు అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి మంచి హిట్ సినిమాలు చేస్తూ ఎంద‌రో అభిమానుల‌ను సాంపాధించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 32 లక్షల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.


నాని - అష్టా చమ్మా చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌స్తుతం నాని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 3.4 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాధించుకున్నాడు.


పవన్ కళ్యాణ్ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి త‌న స్టైల్‌తోనే ఎంద‌రో అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ప‌వ‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో 36 లక్షల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.


రానా - దగ్గుబాటి రానా `లీడర్` సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. రానా తెలుగులో చేసిన‌వి త‌క్కువ సినిమాలే. కానీ ఈయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో మాత్రం ఫాలోంగ్ ఓ రేంజ్‌లోనే ఉంది. ప్ర‌స్తుతం రానాకు 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


నాగార్జున అక్కినేని - అక్కినేని నాగార్జున ఎన్నో సినిమాల్లో న‌టించాడు. ఎన్నో సినిమాల్లో న‌టించిన నాగ్‌కు త‌న రొమాంటిక్ లుక్ ఒక ప్ల‌స్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ ఏకంగా 58 లక్షల మంది ఉన్నారు.
మహేష్ బాబు - రాజ‌కుమారుడు చిత్రంతో కెరీర్ స్టాట్ చేసిన మ‌హేస్ ప్రారంభంలోనే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ ట్విట్ట‌ర్ ఫాలోంగ్ మంచి జోరు మీద ఉంది. ఏకంగా మ‌హేష్‌కు ట్విట్ట‌ర్ ఖాతాలో 8.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: