మార్వెల్ స్టూడియోస్ వారి అభిమానులను డిస్నీ యొక్క స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ + లోకి  రావడానికి ఆసక్తికరమైన సిరీస్‌ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కాలిఫోర్నియాలో జరుగుతున్న డి 23 ఎక్స్‌పోలో మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫీజ్ శుక్రవారం మూడు కొత్త సిరీస్‌లను ప్రకటించారు - షీ హల్క్, ఎంఎస్ మార్వెల్ మరియు మూన్ నైట్. 

జెన్నిఫర్ వాల్టర్స్ అని కూడా పిలువబడే షీ హల్క్, కామిక్స్‌లో బ్రూస్ బ్యానర్ (హల్క్)  బంధువు. బ్యానర్ నుండి ఒక ప్రమాద సమయం లో అత్యవసర రక్త మార్పిడి పొందిన తరువాత ఆమె హల్క్ యొక్క శక్తులను పొందుతుంది. “బ్రూస్ బ్యానర్ ఇక పై ఎం.సి.యు (MCU) లో హల్క్ ఒక్కడు  మాత్రమే కాదు. జెన్నిఫర్ వాల్టర్స్ కూడా ఒక హల్క్, ఆమె ఒక న్యాయవాది, మేము ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఆమె పాత్ర ఉంటుంది ”అని ఫీజ్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: