శర్వానంద్ హీరోగా 2014లో రిలీజ్ అయిన రన్ రాజా రన్ సినిమా, అప్పట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయి, పెద్ద విజయాన్ని అందుకుని, నటుడిగా శర్వాకు అలానే, దర్శకుడిగా సుజీత్ కు మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పాలి. ఆ విధంగా తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సుజీత్, అప్పటినుండి తన రెండవ సినిమాను ప్రకటించలేదు. అయితే ఆ తరువాత కొంత సమయం తీసుకుని, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తదుపరి సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. నిజానికి సుజీత్, తనకు బాహుబలి సినిమా కంటే ముందే సాహో కథను చెప్పడం జరిగిందని, అయితే కథలోని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు నచ్చడంతోనే, బాహుబలి తరువాత తనతో సినిమా చేస్తానని సుజీత్ కు మాటివ్వడం జరిగిందని ఇటీవల ప్రభాస్ పలు ఇంటర్వూస్ లో చెప్పారు. 

అయితే మధ్యలోని ఈ ఐదేళ్లలో సాహో కథలో పలు మార్పులు, చేర్పులు చేసిన సుజీత్, ఈలోపు ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచి, ఆయనకు పాన్ ఇండియా అపీల్ తీసుకురావడం జరిగింది. అయితే ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే సాహోని తెరకెక్కించడం జరిగిందని ఇటీవల సుజీత్ చెప్పారు. తనతో పాటు యూనిట్ మొత్తం రెండేళ్లపాటు ఎన్నో వ్యయప్రయాశలతో సాహో సినిమా కోసం పని చేసారని, అంతేకాక తామందరికి సినిమా మీద మంచి నమ్మకం ఉందని, రేపు రిలీజ్ తరువాత తప్పకుండా ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబడతారని భావిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. సాహో తరువాత సుజీత్, టాలీవుడ్ లోని ఇద్దరు బడా స్టార్స్ తో సినిమాలు తీయనున్నాడని అంటున్నారు. అయితే సాహో రిజల్ట్ మీదనే తన భవిష్యత్తు కొంత ఆధార పడి ఉండడంతో, ఆ సినిమా రిలీజ్ తరువాతనే ఆ హీరోల వద్దకు వెళ్ళి కథలు వినిపించాలని అనుకుంటున్నాడట. 

అయితే ఈ విషయమై మరికొందరు చెప్తున్న వివరాల ప్రకారం, సుజీత్ ఇప్పటికే ఒక బడా స్టార్ కు తన తదుపరి సినిమా కథ వినిపించడం, ఆ హీరోకు స్టోరీ అమితంగా నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని అంటున్నారు. కాకపోతే సాహో రిలీజ్ తరువాతనే సుజీత్ ప్రతిభ అనేది టాలీవుడ్ కి పూర్తి స్థాయిలో తెలుస్తుందనేది అందరు ఒప్పుకోవాల్సిన విషయం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా, తన నెక్స్ట్ సినిమాలను ఇద్దరు స్టార్ హీరోలతో సుజిత్ ప్లాన్ చేసాడు అనే దానిపై ఆయన నుండి అధికారికంగా వెల్లడికావలసి ఉంది. అయితే అది ఒకవేళ అది నిజమైతే మాత్రం, సుజీత్ పక్కా ప్లానింగ్ కి హ్యాట్సాఫ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: